పోస్ట్‌లు

ఆధునిక భావాలను ఆనాడే వెలువరించిన వేమన

చిత్రం
మనసు కవి మనకు మనసుకవి ఆత్రేయే. వేమన కూడా మనసు గురించి విప్పిచెప్పాడు. మనసు గురించి రాయని కవి కూడా వుండడు. మనిషి జీవితంలో మనసు అధిక పాత్ర వహిస్తుంది. మనసు సున్నితమైనది. అది విరిగితే అతుకుడదు.        మనసు బండబారితే దానంత కర్కశత్వం దేనికీ వుండదు. మనసుకు గాయమైతే ఎన్నిలేపనాలు పూసినా మాసిపోదు. వేమన మనసుకవిగా మనస్సు పెట్టి ఇలా చెప్తాడు. ఇనుము విరిగె నేని ఇరుమారు ముమ్మారు కాచి యతుక నేర్చు కమ్మరీడు మనసు విరిగెనేని విరియంట నేర్చునా || విశ్వ!! మానవతావాది         అహింసోపరమోధర్మ: అని బోధించాడు బుద్ధుడు, ఒక చెంపను కొట్టితే మరొక చెంప చూపించమన్నాడుగాంధీ. శత్రువు శరణు జొచ్చితే రక్షించాలని పురాణ నీతులు బోధిస్తాయి. కాని చంపదగిన శత్రువు తన చేత చిక్కినా వానికి ఉపకారం చేయటం మంచిదని వేమన తన సహజ మానవతావాద దృక్పథాన్ని వ్యక్తీకరించాడు. చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కి నేని కీడు - సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు ||విశ్వ!! స్వార్థానికి వ్యతిరేకం  భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదనభీతుజూచి కాలుండు నవ్వును || విశ్వ!! ...

అనంత సాహితీ కళారత్న బిక్కికృష్ణ

చిత్రం
తెల్ల జొన్న రొట్టె పై ఎర్ర కారం నంజుకుని మల్లె మొగ్గల లాంటి అన్నపు మెతుకు కోసం అక్షరాలు విత్తుల్ని మెదడులో నాటుకుని సాహితీ వృక్షంగా ఎదిగిన రైతుబిడ్డ బిక్కికృష్ణ శెట్టూరు మండలం వడ్డె పాళెం గ్రామంలో బిక్కిహనుమంతప్ప,భీమక్క దంపతులకు 8.8.1964 లో   జన్మించారు. ప్రాథమిక విద్య వర్ణచేడులోని ‌వీధిబడిలో, హైస్కూల్ విద్య కళ్యాణదుర్గంలో పూర్తి చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఇంటర్ ను,  బి.ఎ.డిగ్రీ ని రాయదుర్గంలో ప్రభుత్వ కళాశాలలో 1967లో పూర్తిచేశారు. ఇంటర్ డిగ్రీ చదివే రోజుల్లోనే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేశారు. డిగ్రీ పూర్తయ్యాక కళ్యాణదుర్గం మండలం తిమ్మ సముద్రంలోని ఆర్డిటి స్కూల్లో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. 1989లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. తర్వాత తెలుగు కన్నడ భాషల్లో తులనాత్మక అధ్యయనంలో యం.ఫిల్ కూడా చేశారు.         పీజీ చదువుతున్న రోజుల్లోనే రాసిన కవితలను చరమగీతం పేరుతో పుస్తకంగావెలువ రించారు. హిందూపురంలో సేవా మందిరంలో ఉన్న జిల్లా కేంద్రం శిక్ష...

విమర్శకులా? వందిమాగధ భజన బృందాలా?

చిత్రం
ఈ వ్యాసంలోని కొంత భాగాన్ని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం తమ దూరవిద్య విభాగంలో తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంచుకుంది. తెలుగు పత్రికలలో సాహిత్య పేజీలు చూస్తుంటే తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైన రచయితలకు కొదువ లేదనిపిస్తుంది. తెలుగు రచనలను నోర్లు తిరగని విదేశీ రచయితల పేర్లతో పోల్చి పొగడటం కనిపిస్తుంది. తెలుగు పుస్తకాలను అర్థంకాని విదేశీ పుస్తకాలతో తూచి మనవే గొప్పవని తేల్చటం కనిపిస్తుంది. సాహిత్య సభలలో అయితే సరస్వతీ దేవి సైతం సిగ్గుపడేలా రచనను, రచయితను పొగడేయటం వినిపిస్తుంది. ఇంకా పలు సెమినార్లు, సమావేశాలలో పత్రాల సమర్పణలు,  విశ్లేషణలు మన తెలుగు సాహిత్య ప్రభల ముందు ప్రపంచ సాహిత్యం వెలతెలబోతున్నదన్న భ్రమను కలిగిస్తాయి. అయితే ఈ పొగడ్తల ప్రగల్భాలు, ఎత్తివేతల భజనల హోరును దాటి ఎవరయినా ఆయా రచయితల రచనలు చదివితే ఆశాభంగం చెందటం అటుంచి మళ్ళీ తెలుగు రచనల జోలికి వెళ్ళటం సందేహంలో పడుతుంది. అందుకే పత్రికలలో, సభలలో, సెమినార్లలో ఆకాశంలో చుక్కల్లా వెలిగే రచయితలు, పుస్తకాల అమ్మకాలు, పాఠకుల ఆదరణ దగ్గరకు వస్తే తెల్లవారి నక్షత్రాల్లా తెల్లముఖాలు వేస్తారు. ఇందుకు కారణం ఏమిటంటే తెలుగు సాహిత్యంలో ...

కవితా సతి నొసట నిత్యరస గంగాధర తిలకం

చిత్రం
కవితా కదన క్షాత్రుడు అది కాదు, నాకు తెలియకడుగుతున్నాను ఏమిటీ ఘోరం? అబద్ధాలు ప్రకటించడానికి అలవాటుపడిపోయిన - కాదు అంకితం అయిపోయిన ఓ దుర్వార్తా పత్రికలారా! చెప్పండి ఈ వార్త నిజమేనా? (బహుశా నిజమే అనుకోవాలి. అప్పుడప్పుడో భయంకర సత్యం ప్రకటిస్తారు! అప్పుడే మీ అబద్ధాలకు విలువ. ) సిమెంటనే మారు పేరు ధరించిన ఇసుకతో నిర్మించబడిన వంతెనలాంటి ప్రభుత్వమా ఏమిటీ ఘోరం? అని నిన్నడిగి ఏం లాభం? నిద్రపో హాయిగా వృక్షమా! ఋక్షమా! ద్విపక్షమా! బదులు చెప్పండర్రా! మీరైనా జవాబులేదు. గాలి మూగదయిపోయింది పాట బూడిదయిపోయింది వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి నభస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి మరి కనిపించడా? కోకిలవలె కూజించే కలధ్వని కేసరివలె గర్జించే రణధ్వని ఇక వినిపించదా భావి దూర తీరాలకు చేరువుగా విహరిస్తూ జీవనాడి స్పందించే రుధిర మధువు లందించే యువకవి లోక ప్రతినిధి నవభావామృత రసధుని కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం సమకాలిక సమస్యలకు స్వచ్ఛస్పాటిక ఫలకం నడినింగిని మాయమయాడా మన మిత్రుడు కవితా పుత్రుడు కదన క్షాత్రుడు సకల జగన్మిత్రుడు! ____శ్రీశ్రీ

వేటూరి సుందరరామమూర్తి

చిత్రం
        ‌           వేణువై వచ్చాను భువనానికీ అంటూ రయ్ మని దూసుకొచ్చాడాయన.అలలు కదిలినా పాటే, ఆకుమెదిలినా పాటే ఏ పాట నేరాయను బ్రతుకే పాటైన పసివాడను అని పాడుకున్న జీవన పాట సారాయన. మనసు మాటకందనినాడు మధురమైన పాటవుతుంది. మధురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది అన్న ఆ మనిషి, “కృషి వుంటే మనుషులు ఋషులౌతారు, మహాపురుషులౌతారు, తరతరాలకి తరగని వెలుగౌతారు, ఇలవేలుపులౌతారు” అనే అజరామరమైన పల్లవులతో ఎన్నోవేల పాటలు రచించి పాటకు పట్టంకట్టి విశ్వవిఖ్యాత పాటల రచయితగా మనీషిగా నిలిచిన మహనీయుడు ఎవరో కాదు. ఆయనే డాక్టర్ వేటూరి సుందరరామమూర్తి.  తెలుగు సినీగేయకవితా వనమాలిగా మారి పాటల సేద్యం చేసి తెలుగు పాటను  శ్రీ శ్రీ తరువాత జాతీయ స్థాయిలో నిలిపిన పాటల చక్రవర్తి వేటూరి  సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. 19...

కవిత్వం - పదసంపద

చిత్రం
            photo: Manatelangana.com          కవిత్వం చదువుతాం. స్పందిస్తాం. కామెంట్స్ పెడుతుంటాం. కానీ ఎక్కడో ఆ స్పందనను చెబుతున్నప్పుడు కొన్నిసార్లు కవిత్వ పదాల కోసం వెతుక్కుంటాం. తట్టవు. అక్కడ ఏదో రకంగా రాసేసి తప్పుకుంటాం. ఆ కామెంట్స్ కవిత్వ పరిభాషలో అక్కడ సరిపోయే పదాలతో, ప్రశంస రాయగలిగితే బాగుంటుంది కదూ!  అందుకు మనలో ఆ పదసంపద అవసరం. ఆ పదసంపదను పెంచుకోవడం అందరికీ అవసరమే. ఇదిగో- ఇక్కడ నేను కొన్ని కవిత్వ సంబంధి పదాల్ని, పదబంధాలను రాసాను. మీరూ మీకు తోచిన, తెలిసిన కవిత్వ సంబంధి పదాల్ని, పదబంధాలను   రాయండి. ఒకచోట బోలెడు సమకూరుతాయి. రాయండి. ●పదసంపద పోలిక, ప్రతీక, రూపకం, కవితావేశం, కవితా నిర్మాణం, భావుకత, ఊహాశక్తి, కవిత్వ సృష్టి, కంపన, అనుకంపన, తపన, సహజత్వం, కవితాకళ, కవితావాక్యం, భావం, ప్రతిమ, పలుకుబడి, నుడికారం, స్పందన, తక్షణ స్పందన, కవితా స్పందన, ఉద్వేగం, కవిత్వ ఉద్వేగం, కవితా వ్యూహం, మూడ్, ధ్వని, Suggestion, Imagination, టెక్నిక్, ఎమోషన్, సృజన, ఊహ, ఊహాత్మకత, ఊహాజనిత, భిన్నత, విభిన్నత, అభివ్యక్తి, స్థానభ్రంశ...

ఆస్ట్రేలియా స్కూళ్లలో ఆప్షనల్‌గా తెలుగు భాష

చిత్రం
ఆస్ట్రేలియా స్కూళ్లలో ఆప్షనల్‌గా  తెలుగు భాష,శాశ్వత నివాసానికి కూడా ప్రామాణికంగా తెలుగు. ఆమోదించిన ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం (సాక్షి)     ‌‌విభిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయమైన ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషకు అరుదైన గౌరవం లభించింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలుగు భాషకు పట్టం కట్టింది.* అంతేకాకుండా  తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో  5 పాయింట్‌లు  అదనంగా వస్తాయి. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్సిలేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌ (నాటి) నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు 5 పాయింట్లు అదనంగా కలుస్తాయి. ఇది శాశ్వత నివాసానికి ప్రామాణికం. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో ఉన్న సుమారు లక్ష మందికి పైగా తెలుగు వాళ్లకే కాకుండా ఉన్నత చదువుల ...