కవిత్వం - పదసంపద
కవిత్వం చదువుతాం. స్పందిస్తాం. కామెంట్స్ పెడుతుంటాం. కానీ ఎక్కడో ఆ స్పందనను చెబుతున్నప్పుడు కొన్నిసార్లు కవిత్వ పదాల కోసం వెతుక్కుంటాం. తట్టవు. అక్కడ ఏదో రకంగా రాసేసి తప్పుకుంటాం.
ఆ కామెంట్స్ కవిత్వ పరిభాషలో అక్కడ సరిపోయే పదాలతో, ప్రశంస రాయగలిగితే బాగుంటుంది కదూ! అందుకు మనలో ఆ పదసంపద అవసరం. ఆ పదసంపదను పెంచుకోవడం అందరికీ అవసరమే.
ఇదిగో- ఇక్కడ నేను కొన్ని కవిత్వ సంబంధి పదాల్ని, పదబంధాలను రాసాను.
మీరూ మీకు తోచిన, తెలిసిన కవిత్వ సంబంధి పదాల్ని, పదబంధాలను రాయండి. ఒకచోట బోలెడు సమకూరుతాయి. రాయండి.
●పదసంపద
పోలిక, ప్రతీక, రూపకం, కవితావేశం, కవితా నిర్మాణం, భావుకత, ఊహాశక్తి, కవిత్వ సృష్టి, కంపన, అనుకంపన, తపన, సహజత్వం, కవితాకళ, కవితావాక్యం, భావం, ప్రతిమ, పలుకుబడి, నుడికారం, స్పందన, తక్షణ స్పందన, కవితా స్పందన, ఉద్వేగం, కవిత్వ ఉద్వేగం, కవితా వ్యూహం, మూడ్, ధ్వని, Suggestion, Imagination, టెక్నిక్, ఎమోషన్, సృజన, ఊహ, ఊహాత్మకత, ఊహాజనిత, భిన్నత, విభిన్నత, అభివ్యక్తి, స్థానభ్రంశం, ఆల్కెమీ, భావ భంగిమ, శబ్ద కంపనం, స్థాన భ్రంశం, పరస్పర భిన్నం, శబ్దవాతావరణం, అనుభూతి, కవిత్వానుభూతి, స్ఫురణ, స్ఫురించడం, ఘటనాత్మకత, సన్నివేశం, అలంకారికత, యాంత్రిక, యాంత్రికత, శబ్దస్పృహ, అవగతం, ఘటన, మానసిక స్థితి, అపరిచయత్వీకరణ, భావవ్యక్తీకరణ, భావం ప్రతిమగా మారడం, స్వగతం, మానవ గుణారోపణ, సంభాషణ, విరోధాభాస, అర్థరాహిత్యం, విరోధాభాసం, వర్ణన, భావవాహిక, వ్యంగ్యం, వ్యంగ్యోక్తి, ఉల్లేఖన ఉల్లేఖనా పద్ధతి, ఆధునిక దృశ్యం, అసాధారణ పోలిక, మనో వైఖరి, సంవేదన, ఆలోచనాత్మకం, ఆలోచనావేశం, ధోరణి, వ్యక్తీకరణ, కళాత్మక నిర్మాణం, నిర్మాణ పద్ధతి, నిర్దిష్టత, అనిర్దిష్టత, కవితా వ్యాఖ్య, వస్తు సంబంధి, అనిశ్చితి, కవితా వాతావరణం, వస్తుగతం, వస్తుగత జీవితం, వస్తు సముదాయం, ఉద్వేగం, ఉద్వేగ వాతావరణం, కృత్రిమ, కృత్రిమత్వం, వ్యక్తం, వ్యక్తం కావడం, ప్రకంపన, భావ ప్రకంపన, మనోవైఖరి, నామవాచకం, సర్వనామం, గంభీరత, భావ గంభీరత, భంగిమ, gesture, అంతరంగం, కవితాంతరంగం, mood, Misplacement, Temperment, వ్యక్తం చేయడం, వ్యక్తం కావడం, సాత్విక భావం, refrain, effect, ...
_____ యాకూబ్
(From Yakub facebook wall)
నిజమే.
రిప్లయితొలగించండిచాలా మంచి సమాచారం సర్.
ధన్యవాదములు 💐🙏