పోస్ట్‌లు

ప్రతిమల పెండ్లి సేయుటకు

... "ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని  దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌ మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల  దేవత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే"   __ జాషువా ( 'గబ్బిలం' )

వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు

*వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు* వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు. నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు. నేను కార్మిక నాయకుడ్ని కాదు కాబట్టి మాట్లాడలేదు తర్వాత వాళ్లు కాథలిక్కుల కోసం వచ్చారు. నేను ప్రొటెస్టెంటును కాబట్టి మాట్లాడలేదు చివరకు వాళ్లు నా కోసం వచ్చారు. అప్పటికి నాకోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు -జర్మనీలో నాజీల పాలన గురించి మార్టిన్ వీమోల్లర్ (1892–1984) అనే మత గురువు చెప్పిన మాటలు

tea పైన పద్యం

మంచి 'tea' గొప్ప kick ఇవ్వడానికి ఒక cup చాలు. ఎర్రాప్రగడ ఒక్క పద్యంలో ఎన్ని 'టీ ' లు ఇచ్చేడో చూడండి. సహజంగానే గొప్ప kick ఇచ్చే పద్యం ఇది. "నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ ఘనకోటీ శకటీ కటీ తటి పటీ గంధేభ వాటీ పటీ  ర నటీ హారి పటీ సువర్ణ మకుటీ ఫ్రచ్చోటికా పేటికల్  కనదామ్నాయ మహాతురంగ శివలింగా నీలకంఠీశ్వరా "

చదువనివాడజ్ఞుండగు

చదువనివాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ! చదువుకోనివాడు అజ్ఞాని అవుతాడు. బాగా చదువుకుంటే సత్, అసత్ అంటే ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు బాగా అర్థమవుతాయి. అందుకే అందరూ శ్రద్ధగా చదువుకోవాలి.  భాగవతం,పోతన

దేశమును ప్రేమించుమన్నా

దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ ! పాడిపంటలుపొంగి పొర్లే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ! ఈసురోమని మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్ జల్డుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్ ! అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్  దేశి సరుకులు నమ్మవెలె నోయ్  డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్ ! వెనుక చూసిన కార్యమేమోయ్ మంచిగతమున కొంచమేనోయ్ మందగించక ముందు అడుగేయ్ వెనుక పడితే వెనుకేనోయ్ ! పూను స్పర్దను విద్యలందే వైరములు వాణిజ్య మందే వ్యర్ధ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్ ! దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పకోకోయ్ పూని యేదైనాను, వొక మేల్  కూర్చి జనులకు చూపవోయ్ ! ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసె నోయ్ ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్ పరుల కలిమికి పొర్లి యేడ్చే పాపి కెక్కడ సుఖం కద్దోయ్ ఒకరి మేల్ తన మేలనెంచే నేర్పరికి మేల్ కొల్ల లోయి ! సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయ్ ! చెట్ట పట్టాల్ పట్టుకుని  దేశస్తు లంతా ...

కవిత్వంలో అల్లిక పొందిక

కవిత్వంలో అల్లిక పొందిక ____జిలుకర శ్రీనివాస్ కవిత్వంలో వస్తువు, దాని వ్యక్తీకరణ, వాటి మధ్య తాత్విక సంబంధం గురించి చర్చించడమే అల్లిక, పొందిక. భాషపరంగా చూస్తే కవిత్వం ఒక సంకేతాల వ్యవస్థ. భావాన్ని పరస్పరం వ్యక్తీకరించుకునేది భాష. భాష అంటే సంకేతాల వ్యవస్థ. సంకేతం అంటే ఏమిటి? మనభావాల్ని ఎలా మోస్తుంది? అది సరియైనదా? వ్యక్తీకరించటానికి భాష సరిపోవట్లేదు అని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి వుంటుందా? ది లిమిటేషన్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ యువర్ వరల్డ్. మనం ప్రపంచాన్ని ఎంత తెలుసు కుంటామో అంతే జ్ఞానాన్ని కలిగి వుంటాం. నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణం పొందిందో...  అని శ్రీశ్రీ అంటున్న ప్పుడు ఇదే సందేశం వినిపిస్తుంది - ఒకదాన్ని ఎంపిక చేయటం అంటే మిగతావాటన్నిటిని తుడిచి వేయటమే. కవిత్వమెప్పుడూ తుడిచేసే ప్రక్రియే. పదేపదే మార్పులు ఎందుకు చేస్తాం. అంటే ఇదే కారణం. అన్ కంట్రోల్డ్ ఇన్స్పి రేషన్ నుంచి కవిత్వం పుడుతుందని సోక్రటీస్ అంటాడు. ఈ కవిత్వాన్ని అనేక సార్లు దిద్దుకుంటాం. భాష అసమగ్రమైనది. సరైన పదం కోసం వెదుకుతాం. పచ్చని కవిత్వానికి పది సూత్రాలు  11     పిళ్లా కుమారస్వామి...

కదిలే ప్రపంచం.. కదిలించే కవిత్వం...

కదిలే ప్రపంచం.. కదిలించే కవిత్వం... ____జ్వాలాముఖి: ప్రతి పది సంవత్సరాలలో సాహిత్యంలో మార్పులు వస్తాయి. నన్నయ్య అక్షర రమ్యత, తరువాత పోతన కవిత్వం, శ్రీనాథుని చాటువులు, శతక వాజ్మయం వచ్చింది. వేమన సుమతి, ధూర్జటి లేకపోతే లౌకిక చింతన, నిజమైన సంస్కారం వచ్చేది కాదు. నన్నయ్య అక్షర రమ్యతలో సంస్కృతి, తెలుగు పదాలు, తత్సమాలు సరైన పొందికలో వుండటం, కథనశైలి, అక్షర రమ్యత పొందిక కుదిరింది. 11వ శతాబ్ధపు నన్నయ్య తరువాత చీము, నెత్తురు ఉన్నట్లు పాత్రలు ముందుకు వచ్చాయి. 13వ శతాబ్ధపు తిక్కన దగ్గర ఇది ప్రారంభమైంది. ప్రజల్లో వున్న జాను తెలుగును సంస్కృతాన్ని కలిపి రాశాడు తిక్కన. తెలుగులో వీరేశలింగం 30 పద్యాల సరస్వతీ, నారద సంవాదం రాశాడు. శతక కవులు వచ్చారు. చంధస్సు, భావాలకు కవిత్వం పరిమితమా ? చందోబద్ధంగానే కవిత్వం ఉండాలా ? ఇవన్నీ నేటి ప్రశ్నలు కావు. పొలరైజేషన్ కవిత్వంలో జరిగింది. ఉ రి, శిరస్సు చెప్పిన బాధలు, బాధల భావాలు చెప్పిన వేశ్య, కదిలే జీవితం, కదిలించే కవిత్వం - మనిషిని కదిలిస్తుంది. ఈసురోమని మనుషులుంటే 'దేశమేగతి బాగుపడువోయ్' అని అన్నాడు గురజాడ. దీన్ని మార్చెందుకే సాహిత్యం మారుతూ వుంటుంది. నానీలు, వచన...