పోస్ట్‌లు

ఆధునికం అంటే

చిత్రం
https://slideplayer.com/slide/6331672/ ఒక సమాజాన్ని లేదా ఒక దృష్టికోణాన్ని 'ఆధునికం' అని ఎప్పుడు అనగలం? కనీసం ఈ కింది నాలుగు లక్షణాలుంటే అనగలం. 1). వ్యక్తులందరికీ స్వంత హేతుబుద్ధిని నిర్భయంగా ఉపయోగించగల స్వేచ్ఛ. 2). వ్యక్తిని అన్ని రకాలుగా  ఒత్తిడి పెట్టే  సంప్రదాయ నిరంకుశ సముదాయం నుండి స్వేచ్ఛ. 3). తనకు నచ్చిన జీవితానందాన్ని వెతుక్కునే , తనకు నచ్చిన కళారూపాల్లో తన్ను తాను వ్యక్తం చేసుకోగలిగే స్వేచ్ఛ. 4). మనిషి ఎలా బతకాలో ఆదేశించే ధర్మశాసనాల నుండీ  , అశాస్త్రీయ నియమావళుల నుండి స్వేచ్ఛ. (from facebook wall of bargava)

భారతీయ సంస్కృతి

చిత్రం
భారతీయ సంస్కృతి "సంస్కృతి" అంటే ఆచారం. అంటే జీవిత విధానం. ఇంగ్లీషులో సంస్కృతిని "కల్చర్" అంటారు.కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం  కల్చుర  లేదా  కొలెరె   నుండి వచ్చాయి. దీని అర్థం "సాగు" . కోలెరె  అనే పదం  అర్థం 'పండించడం'. దీనిని బట్టి ఈ పదాలు వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయని తెలుస్తుంది. ఒక సమాజంలో ఉన్న పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. మధ్య యుగాలలో, సంస్కృతి అంటే భూమి ని సాగు చేసే విధానం. పునరుజ్జీవనోద్యమంలో "పండించిన" మనిషి వికాసం గా మారింది.అవి సాహిత్యం, లలిత కళలకు సంబంధించినదిగా మారింది.19 వ శతాబ్దంలో, సంస్కృతిలో మంచి,మర్యాదలు, ఆచారాలు కలిశాయి. ఇప్పుడు సంస్కృతి లో విలువలు, నమ్మకాలు, భాష మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా వచ్చి చేరాయి. సంస్కృతి  డైనమిక్  గా ఉంటుంది. అంటే  సంస్కృతిలోని అంశాలు రూపాంతరం చెందుతాయని అర్థం. అంతేగాక అవి ఇతర సంస్కృతుల ప్రభావానికి లోనవుతాయి కూడా. సంస్కృత భాషలో " సంస్కృతి" అంటే "సంస్కరణ చెందిన విషయం” అని అర్థం. "సంస్కరణకు" అర్థం చెడులో ఎంతో కొం...

ఏది అసలైన కవిత్వం?

చిత్రం
ఏది అసలైన కవిత్వం? ఇవాళ ఏది సుకవిత్వమో !.ఏది కుకవిత్వమో తెలియక కొత్త కవులు తికమక పడుతున్నారు.అసలు కవిత్వమే కాని కవిత్వానికి పురస్కారాలు ఇవ్వడం,ఏవో కొన్ని వాక్యాలు పేర్చి వాటిని కవిత్వంగా అచ్చు వేయడం.ఆపై వాటిపై సమీక్షలు వ్యాసాలు రావడం..చిన్న పెద్ద పత్రికల్లో ముద్రించుకొని మురిసిపోవడం...దాన్ని గొప్ప కవిత్వంగా భ్రమింపచేయడం.ఇవాళ తెలుగు కవిత్వంలో జరుగుతున్న మార్కెటింగ్ తంతు.కవితను ఎలా నిర్మించాలో..ఎలాంటి కవితా నిర్మాణాలు అనుసరించాలో తెలియకపోయినా...చే.రా.అన్నట్టు" కొన్ని గారడి వాక్యాలు,హాస్యోక్తులు,ప్రశ్నార్థకవాక్యాల్ని పదే పదే రిపీట్ చేయటం,సింబాలిక్ పేరిట అయోమయ సంకేతాలు గుప్పించడం," కవిత్వం కాదు.ఒకే వస్తువుకు ఏళ్ళ తరబడి సానపెట్టడం(కాలంలో వచ్చిన మార్పులు గమనించకుండ)ఇంకా శ్రీ శ్రీ లాగో,సి.నా.రె లాగో,తిలక్, అజంతాల లాగా కవితలు రాయాలని చూడటం ఇవన్నీ..నేడు ప్రీవర్స్ రాస్తున్న వాళ్ళు చేస్తున్న ట్రిక్కులు.అందుకే చే.రా.ఏనాడో భావ,అభ్యుదయ,విప్లవ,కవుల ఖండికల సంపుటులు మహా కావ్యాలుగా భ్రమపడకూడదన్నారు.రా.రా.లాంటి విమర్శకులు తిలక్ మంత్ర లోకపు మణి స్తంభాల కవిత్వాన్ని అసలు కవిత్వమే కాదని...

అంబేద్కర్‌ జీవితం - ఉద్యమం

చిత్రం
    pc : the companion.com అంబేద్కర్‌ మధ్యప్రదేశ్‌లోని మౌ' అనే గ్రామంలో కీ.శ. 1891వ సంవత్సరం ఏప్రిల్‌ 14న జన్మించారు. ఆయన తండ్రి రామ్‌ జీ మలోజీ సక్పాల్‌, తల్లి భీమాబాయి షెడ్యూల్డు కులమైన మహర్‌ కులానికి చెందిన వారు. ఆయన ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు. లోకమాన్య బాలగంగాధర తిలక్‌, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్‌ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామం వీరి తండ్రిగారి పూర్వీకులది. జీవితంలో ఎదురైన ఎన్నో అవరోధాల మధ్య ఆయన విద్యాభ్యాసం సాగింది. అవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఎంతో తోడ్పడ్డాయి. పాఠశాల విద్యాభ్యాసం సతారాలోను, ముంబైలోను, కళాశాల విద్యాభ్యాసం ముంబై లోను పూర్తిచేసిన అంబేద్కర్‌ 1913లోను మరియు 1917లో కొద్దికాలంపాటు బరోడా మహారాజుగారి దగ్గర సేవలుకూడా అందించాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో కొలంబియా విశ్వ విద్యాలయంలో, గ్రేస్‌ ఇన్‌ బాక్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. 1920లలోనే అంబేద్కర్‌ ఎమ్‌.ఎ, పి.హెచ్‌.డి. ఎమ్‌.ఎస్‌.సి (అర్థశాస్త్రం), డి.ఎస్‌.సి (అర్థశాస్త్రం) మరియు బారిస్టర్‌ ఎట్‌ లా పూర...

రాయలసీమ,విమర్శకు పట్టుగొమ్మ

చిత్రం
                  cattamanchi ramalingaareddi                 Pc Wikipedia ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు కేంద్రం రాయలసీమ           ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రాయలసీమ నుండే ప్రారంభమైంది. ఇంకొంచెం ముందుకు పోతే వేమన ,వీరబ్రహ్మం లు ఆధునిక  భావాలు తెలుగు నేలకు అందించారు. ఆ తరువాత  కట్టమంచి రామలింగారెడ్డి తో ఈ ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైందని అందరికీ తెలిసిందే.  రారా, వల్లంపాటి , త్రిపురనేని మధుసూదన రావు, సింగమనేని, రాచపాళెం, తెలకపల్లి రవి,కేతు విశ్వనాథరెడ్డి,కవిత్వవేది, మేడిపల్లి,కిన్నెర శ్రీదేవి మొదలైన వారందరూ ఈ  పరంపరలో వచ్చినవారే.        రాయలసీమలో కూడా కథాసాహిత్యం కూడా  కోస్తా ప్రాంతం తో సమాంతరంగా   రాయలసీమ లో వచ్చిందని వర్తమాన పరిశోధకులు తవ్వా వెంకటయ్య, అప్పిరెడ్డి హరనాధరెడ్డి ఇటీవల తమ పరిశోధనలో బయట పెట్టారు.                    తెలుగు సాహిత్య చరిత్ర...

స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం

చిత్రం
స్వాతంత్రోద్యమం_ సంస్కరణ ఉద్యమాలు _ స్త్రీల భాగస్వామ్యం సమాజంలో లో స్త్రీలు సగభాగం అయినప్పటికీ స్వాతంత్రోద్యమంలో  మహిళల పాత్ర తక్కువగా ఉండేది.  మహిళలను భాగస్వామ్యం చేయకుండా స్వాతంత్రం సాధించలేమని  నాయకులు గుర్తించారు.దీనికి ఆటంకంగా ఉన్నవి సమాజంలో ఉన్న దురాచారాలు కట్టుబాట్లే నని అర్థం చేసుకున్న నాయకులు సమాజంలో సంస్కరణలకు కట్టారు. ఆర్య సమాజం ,బ్రహ్మ సమాజం మొదలైన సామాజిక సంస్థలు హిందూ ముస్లిం  మతాలలో వున్న మూఢాచారాలను ,కట్టుబాట్లను ఎదిరించాలని అనేక సామాజిక ఉద్యమాలు చేపట్టాయి.హరిజనుల పట్ల వున్న అంటరానితనాన్ని పోగొట్టాలని ప్రచారం చేశారు. స్త్రీ పురుషులు సమానం అన్నారు. దయానంద ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రామకృష్ణ పరమహంస వివేకానంద రాజారామమోహన్ రాయ్ కందుకూరి రఘుపతి వెంకటరత్నం గురజాడ వంటి సంస్కర్తలు స్త్రీ విద్య, బాల్యవివాహాల నిషేధం, సతీసహగమనం, స్త్రీల పునర్వివాహం ,కన్యాశుల్కం రద్దు, వరకట్న నిషేధం వంటి దురాచారాలపై ఉద్యమాన్ని నిర్మించారు .ఈ విషయంలో ఆంగ్లేయుల విద్యా విధానం కూడా తోడ్పడింది.ఈ ఉద్యమాల మూలంగా స్వాతంత్ర్యోద్యమంలో కి చాలామంది యువతీయువకులు అడుగు పెట్టారు. జాతీయ నాయకుల ప్రోత...

పసిడి పలుకులు

వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’ * - అల్లసాని పెద్దన * 22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ * - చేమకూరి వేంకటకవి * 23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ * - త్యాగయ్య * 24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ * - ధూర్జటి * 25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’ * - బద్దెన * 26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ * - వేమన * 27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ * - కంచర్ల గోపన్న * 28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ * - సుద్దాల హనుమంతు * 29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ * - ఆరుద్ర * 30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ * - వేముల శ్రీ కృష్ణ * 31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ * - త్రిపురనేని రామస్వామి * 32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ * - బాలాంత్రపు రజనీకాంతరావు * 33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ * - అడవి బాపిరాజు * 34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’ * - కరుణశ్రీ * 35. ‘‘ఊరు ...