పోస్ట్‌లు

మట్టిపూల జీవన తాత్వికత వెల్లివిరిసిన కథలు

''కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరిపగ్గం, సాలెలమగ్గం/ శరీర కష్టం స్ఫురింపజేసే/ గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి/ సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు'' అని శ్రీశ్రీ తన ప్రతిజ్ఞా గీతంలో చెపుతాడు. ఇలా వివిధ వృత్తుల వారి జీవన తాత్వికతను, శ్రమజీవన పోరాటాన్ని కథలుగా మలిచి వృత్తిదారుల కథా సంపుటాలను వెలువరిస్తున్నారు మూరిశెట్టి గోవిందు. ఆయన ఇదివరకే మంగలి కతలు, చాకిరేవు కతలు తీసుకొచ్చారు. ఇప్పుడు కుమ్మరి కథలు రాశారు.         కుమ్మరి చక్రం ఆగిపోతున్నా, కాలచక్రం గిర్రున తిరుగుతోంది. తొంభై దశకంలో మొదలైన ప్రపంచీకరణతో పల్లె సామాజిక జీవన చిత్రం పెను కుదుపులకు గురైంది. సాంకేతికత అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ఫలితంగా చేతివృత్తులు ధ్వంసం అయ్యాయి. దాంతో 'పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల' అంటూ గోరటి వెంకన్న పాట రాశాడు. కొలిమి ఆరిపోయింది. కుమ్మరి చక్రం, నాగలి విరిగిపోయాయి. సాలెల మగ్గం పోగు తెగిపడింది. వాటి స్థానంలో స్టీలు గిన్నెలు వచ్చాయి. ఇనుప మడకల ట్రాక్టరు వచ్చింది. వృత్తిదారులు తమ వృత్తులను వదిలేసి పట్టణాలకు వలసెల్లిపోయారు. ఇంకా పాతవాటిని వదులుకోలేక మార్పుకు మానసికంగా సిద్ధపడని ...

ఉమర్ ఖయ్యాం

చిత్రం
                                            Umar Khayyam                                                    ఉమర్ ఖయ్యాం  పూర్తిపేరు గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఉమన్ ఇబ్రహీం ఖయ్యాం. పారసీ దేశంలో, ఈశాన్యమూల ఉన్న ఖురాఉమర్ ఖయ్యాంఉమర్ ఖయ్యాంసాన్ రాష్ట్రానికి ముఖ్యపట్టణ మైన, నిషాపూర్లో జన్మించాడు. జననం,క్రీస్తు తరువాత 1025-1050 సంవత్సరాల మధ్యలో అని విమర్శకుల నిశ్చయం. ఖయ్యాంను గురించి ప్రత్యేక పరిశోధనలు చేసి, అతని జాతకాన్నికూడా తయారుచేసిన వి.యం. దాతా, అతని జననం 1041 సంవత్సరం మే నెల 18వ తేదీ సూర్యోదయ సమయంలో అని నిర్ణయించారు. దాతా వలెనే కృషిచేసిన, సయ్యద్ సులేమాన్ నర్వీకూడా. 1048 సంవత్సరం సరియైనదని నిశ్చయించాడు. ఉమర్ ఖయ్యాం బాల్యం, బల్ఖ్ లో గడిచింది. తరువాత, ఇమాం ముఆప్ఫక్ నైషాపురి వద్ద చదువుకున్నాడు. ఆయన వద్ద చదువుకున్నవారు పేరు ప్రఖ్యాతులు గలవారవ...

matti pogu pai vimarsa

నేను సమాజాన్ని ఆందోళన నా ఆయుధం మునుపు మట్టి, మన్ను అనే పదాలను తిట్టడానికి ఉపయోగించేవారు. ఉదాహరణకు నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నిన్ను మట్టిలో పూడుస్తా, నీ ముఖం మీద మన్ను పడ లాంటివి. ఆ తర్వాత మట్టి పదానికి కవిత్వ గౌరవం ఎక్కువగా లభిస్తూ వచ్చింది. నేలలోని మొక్కల పెరుగుదలకు ఉపయోగపడగల మెత్తటి పొడిని మట్టి అంటారు. మట్టితో కుండలను, మట్టి ఇటుకలను, మట్టి బొమ్మలను తయారుచేస్తారు. కొన్ని చోట్ల మట్టితో కోటలను నిర్మించారు. మట్టి మనుషులుగా రైతులను గౌరవిస్తున్నాము. మట్టిలో మాణిక్యం అనే పద బంధాలను వాడుతున్నాము. కవిత్వ పరంగా మట్టి, మన్ను, బురద లాంటి పదాలకు సముచిత స్థానాన్ని కల్పించింది మాత్రం కవులేనని చెప్పవచ్చు. వాస్తవానికి మట్టి లేకపోతే మానవ మనుగడ కొనసాగలేదు. మట్టి మానవ పురోగాభివ్రుద్ధికి కారకం.  మట్టి కాలుష్యం లేదా నేల కాలుష్యం జీనోబైయాటిక్ రసాయన లేదా సహజ నేల వాతావరణంలో మార్పులు కలగటం వల్ల కలుగుతుంది. సాధారణంగా పారిశ్రామిక, వ్యవసాయ రసాయనాలు, లేదా వ్యర్ధాల యొక్క సరికాని ప్రదేశాలలో పారవేయడం వలన కలుగుతుంది. వీటిలో అత్యంత సాధారణ రసాయనాలు పెట్రోలియమ్, హైడ్రోకార్బన్, పాలీ అణు ఆరోమ్యాటిక్ హైడ్రోకార్బన్స...

క్రిస్టోఫర్ కాడ్వెల్

చిత్రం
క్రిస్టోఫర్ కాడ్వెల్  Art is the Product of Society. As the Peral is the Product of Oyster. పై మాటలు క్రిస్టోఫర్ కాడ్వెల్ వి. నిజమే ఆణిముత్యాలు ఎక్కడ దొరుకుతాయి. అగాధమైన కాల నిధులలోనే దొరుకుతాయి. కవిత్వం సమాజం వేరువేరుగా లేవు. సమాజంతో కవిత్వం ముడివడి వుంది. అధ్యయనం. ఆ వెంటనే సమన్వయం చేసుకొవడం జరగాలి. అలా కాకపోతే అది అధ్యయనం కాదు. అది కవిత కావచ్చు. నవల, నాటకం, విశ్లేషణ, విమర్శ ఏదైనా కావచ్చు. ఎక్కడైనా పుట్టొచ్చు. కాలం ఏదైనా కావచ్చు. దేశం ఏదైనా కావచ్చు. అన్నీ సమాజంతోనే వున్నాయి. అలా చెప్పుకుపోతూ కాడ్వెల్, మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్యాన్నీ సమాజాన్నీ, ఉత్పత్తి విధానాల్ని వాటి సంబంధాల్ని,మతాన్ని, కళని, సాంకేతిక శాస్త్రాలని అధ్యయనం చెయ్యడానికి తన రచనల ద్వారా ప్రపంచానికి ఓ నమూనాని అందించాడు. ఓ మార్గాన్ని చూపించాడు.           మార్క్సిస్టు తాత్విక రచయిత క్రిప్టోఫర్ కాడ్వెల్ 1907 అక్టోబర్ 20న పుట్టాడు. 1932 ఫిబ్రవరి 12న మరణించాడు. మరణం మామూలుది కాదు. నాజీ ఫాసిస్టు లతో పోరాడుతూ మరణించాడు. యుద్ధరంగంలో మరణించాడు. అప్పటికి ఆయన వయస్సు 30 లోపే. ...

సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి ?

చిత్రం
సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి ?                            Pic Source: thestrip.ru మనకు చిన్నప్పుడు అమ్మమ్మలూ, నాయనమ్మలూ చెప్పిన ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. శివుడు ఎద్దును ఒక చాటింపు వేసి రమ్మన్నాడట మనుషులందరూ రోజుకు ఒక్కసారి భోంచేసి, మూడుసార్లు స్నానం చెయ్యాలని. ఆ ఎద్దు పొరపాటున వ్యతిరేకంగా చాటింపు వేసింది. రోజుకు ఒక్కసారి స్నానం చేసి, మూడుసార్లు భోంచెయ్యాలని, దాంతో శివుడిక్కోపం వచ్చి, రోజుకు మూడుసార్లు తినడానికి అవసరమైన పంటల్ని పండించడానికి ఆ ఎద్దునే కష్టపడమని దానికి శిక్ష వేశాడట. ఎంత అద్భుతమైన ఊహ! మానవుడు తాను రోజుకు మూడుసార్లు తినడానికి ఆ ఎద్దుచేసిన పొరబాటే కారణంగాని, తాను కారణం కాదని చెప్పుకోడానికి అల్లుకున్న అందమైన కథ ఇది. మానవుడు కథలు రాయడం ప్రారంభించకముందే, కథలు చెప్పుకునే సంప్రదాయాన్ని ఎప్పుడో ప్రారంభించి ఉంటాడు. మానవుడు స్వార్ధపరుడు. తన 'జాతి స్వార్థం' మానవుడితోబాటు ఏ జీవికయినా ఉండడం ప్రకృతి సహజం. ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడాన్ని దోపిడీ అనాలేగాని, స్వార్థం అనే చిన్నమాటతో తేలిగ్గా చెప్పకూడ...

పద్యం × వచనకవిత

పద్యం × వచనకవిత                    __ వి.చెంచయ్య పద్యాన్ని సాంప్రదాయికుల్లో వ్యతిరేకించేవారు లేరు.ఆధునికుల్లో వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. సమర్థించేవాళ్లూ ఉన్నారు. వ్యతిరేకించే వాళ్లందరూ ఒక రకం కాదు. గుడ్డిగా వ్యతిరేకించేవాళ్లు కొందరుంటే ఉండవచ్చుగానీ, ఎక్కువ మంది సకారణంగా వ్యతిరేకించేవాళ్లే. నిజానికి పద్యాభిమానులు వచన కవితను సకారణంగా కాక, గుడ్డిగా ద్వేషించినట్టు కనబడుతుంది. పద్యం, వచన కవిత - రెండూ సహజీవనం చేస్తున్న కాలంలో పద్యాభిమానులైన ఆధునిక కవులు వచన కవితను గుడ్డిగా వ్యతిరేకించారు. దువ్వూరి రామిరెడ్డి వచన కవితను 'జ్యామెట్రీ కవిత' అన్నాడు. జాషువా 'తోకపీకుడు కవిత్వ' మన్నాడు. ఇంకా చాలామంది పెట్టుబడి లేని కవిత్వం అన్నారు. వీరందరూ కూడా వచన కవిత పట్ల ఈ అభిప్రాయాల్ని సకారణంగా నిరూపించలేదు. వారి పద్యాభిమానమే వచన కవితా వ్యతిరేకతకు కారణమైంది. కానీ పద్యాన్ని వ్యతిరేకించే వాళ్లలో చాలా మంది తమ తమ కారణాల్ని చూపుతున్నారు. చివరికి పద్యాన్ని వ్యతిరేకిస్తూ తిట్టు కవిత్వం రాసిన వాళ్లు కూడా అందరూ ఊరికే తిట్టలేదు. "రాముని పాదం మోసీ.... మోసీ.../ పద్యం రాము...

వేమన పద్యాలు

  అనువుగాని చోట నధికుల మనరాదు కొంచమయిన నదియు గొదువరాదు  కొండ యద్దమందు గొంచమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము :  కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంతమాత్రాన అది చిన్నదయిపోదు. అలాగే అనువుగాని (తగని, అనవసరమైన) చోట గొప్పవారని చెప్పుకోకూడదు. అలా చేయడం వల్ల ఏ నష్టం కలగదు. అటువంటి చోట్లలో తగ్గి వుండటమే మంచిది.