పోస్ట్‌లు

శత్రువు ఒకడుండాలె!

శత్రువు ఒకడుండాలె!  కాలం నదిలో  నీ ఎదురీతను చూసి నవ్వడానికి శత్రువు ఒకడుండాలె! అపుడే నీవు గమ్యం చేరగలవు! గుడ్డుపైన కోడిపెట్ట పొదిగితేనే కోడిపిల్ల బయటికొచ్చినట్టు నీ గుండెపైన శత్రువుమాట గుదిబండలా మారితేనే ఏ నిద్రపట్టని రాత్రో ఓ వెలుగుగెలుపుకిరణం నీలో తళుక్కుమంటుంది! మాటలపువ్వులు నీపై విసిరేవాళ్ళంతా మంచి మిత్రులనుకోకు! పూలవెనుక ముళ్ళున్నట్టే మిత్రులముసుగులో శత్రువులుంటారు! నీ శత్రువు ఎవరోకాదు ఒకప్పటి నీ మిత్రుడే! చిన్నబండను చూసి కుక్క మొరగదు కదా! అది పెద్ద కొండను చూసే ఊరికే అలా మొరుగుతుంటుంది! అకారణ ద్వేషంతో నిన్ను ఎవడైనా నిందిస్తున్నాడు  అంటే నీ ఎదుగుదలే వాడి మానసిక అశాంతికి కారణమై ఉంటుంది! వాడు శత్రురూపంలో ఉన్న మిత్రుడే అన్న మాట! పాపం వాడు తన విలువైనకాలమంతా నీ గురించే ఆలోచిస్తున్నాడంటే... నీకర్తవ్యపు నెగళ్ళను ఎగదోస్తూ నిన్నో మండే సూర్యుడిని చేస్తున్నాడన్నమాట! ముళ్ళకంచె లేకుంటే పూలతీగ ఎలా పైకెగబ్రాకుతుంది? ఎవడు ఏ రంగంలో ఎదగాలన్నా వాడికో శత్రువుండాలి సుమా! గాలి ఎక్కువైన టైర్ ప్రేలిపోతుంది ఏది ఎక్కువైనా మనిషి కూలిపోతాడు! టైరులో ఎంతగాలి ఉండాలో మెకానిక్ కు తెలుసు! నీకేమిచ్చి బ...

తూరుపు తెలవారుతుంది ప్రతి దినం

తూరుపు తెలవారుతుంది ప్రతి దినం  కాలం గతి మారుతుంది ప్రతీ క్షణం మంచి మార్పు లోకానికి మంగళ దాయకం  అది వికటించిందా...!  లోకానికి అభ్యుదయవినాశకం  ప్రసరించే గాలికి లేదు కులం ప్రవహించే నీటికి లేదు మతం  కులం పేర మతం పేర జరిగే కలహాలు  మనిషిని పశువుగ మార్చే విష వలయాలు  తూరుపు తెలవారుతుంది ప్రతి దినం కాలం గతి మారుతుంది ప్రతీ క్షణం ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది చీకటి, ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు ఏది పుణ్యం, ఏది పాపం ఏది నరకం, ఏది నాకం  ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది సత్యం, ఏదసత్యం ఏదనిత్యం, ఏది నిత్యం ఏది ఏకం, ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా , ఓ మహర్షి

మారాలి మన సమాజం__నార్ల చిరంజీవి

మారాలి మన సమాజం         ‌‌       ‌‌ ‌‌          _ నార్ల చిరంజీవి పల్లవి: మారాలి -మన సమాజము మారాలి మారాలి - మన సమాజము చరణం:  నిరుద్యోగమూ నిరాశానేడు  అడుగడుగన సమాజాన్ని ఆవరించెరా స్వార్థపూరితం - నిస్వార్ధమే శూన్యం  స్వార్ధమే సమాజాన్ని స్వారీ చేసెరా ప్రజాస్వామ్యం పేర - పదవుల వేట  ప్రజల మరచి - ప్రజాధనము పంపకాలురా కష్టజీవుల రక్తం - కలవారల భుక్తం కమ్మిందీ సమాజాన్ని కారుమబ్బులా  కులమత భేదం - ప్రాంతీయతత్వం ద్వేషాలే కాలకూట విషముగ్రక్కెరా తరతరాలుగ - సంప్రదాయము పేర  స్త్రీ జాతిని బానిసలుగ చేసినారురా ఏదో ఒక మూల చైతన్య ( విప్లవోద్యమ) జ్వాల  రగిలి రగిలి నవసమాజ నాంది యగునురా  మారాలి మారాలి 

కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది? సినారె

https://youtu.be/jAiQlEZpi84 *కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది?* *- సినారె* కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది? కత్తులు నాటిన గుడిలో భక్తి ఎలా పండుతుంది? అంతా భద్రం అంటూ ఎంత కాలమీ సూక్తులూ... వంచన దూరిన ఇంట్లో మంచి ఎలా బ్రతుకుతుంది? నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది? కరగనిదే కొవ్వొత్తి కాంతి ఎలా పుడుతుంది? చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది? ఫలితం అందేది, తీవ్ర పరిణామం లోనె సుమా... మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది? నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది? కలవర పడి వెనుదిరిగితే, కాలం ఎగబడుతుంది. కదనుతొక్కి చెలరేగితే, కాలం భయపడుతుంది. కర్మయోగి ఏనాడూ కాలాధీనుడు కాదు. కనురెప్పలు మూతపడితే, కాలం జోకొడుతుంది కంఠమెత్తి తిరగబడితే, కాలం జే కొడుతుంది. అపూర్వ సృష్టిని జరపని అహంకారమది వ్యర్థం. అందంతో శ్రుతి కలవని అలంకారమది వ్యర్థం. చాటింపుల వెనుక ఉన్న సరుకెంతో తెలుసునులే... అరుదైన ప్రతిభకివ్వని పురస్కారమది వ్యర్థం. ఆత్మశుద్ధి తో చేయని నమస్కారమది వ్యర్థం. వాగుబోతు ఆగడు తన వాక్కులు కక్కేయందే. తాగుబోతు ఆగడు తన తాగుడు ఎక్కేయందే. ఎవరెంతగ మొత్తుకున్న ఎక్కదులే ఆ చెవికి... తిరుగుబోత...

నవ్వులు రువ్వే పువ్వమ్మా

నవ్వులు రువ్వే పువ్వమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా... ఉన్న నాలుగు నాళ్ళు నీలా  ఉండిపోతే చాలమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా ఆకుల పయ్యెదలో  నీ ఆడతనాన్ని దాచావు రేకుల కేంపులలో  నీ రేపటి ఆశలు నింపావు ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన  మొగ్గ సొగసు ఉందమ్మా... నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా ఈ తోట మొత్తమూ కమ్మినవి  నీ దోరవయసు అందాలు ఈ గాలి మత్తులో ఉన్నవీ  నీ కన్నె మనసులో కైపులు ఈ తోట మొత్తమూ కమ్మినవి  నీ దోరవయసు అందాలు..  ఈ గాలి మత్తులో ఉన్నవీ  నీ కన్నె మనసులో కైపులు నువ్వు ఒలకబోసే ఓంపుసొంపులకు  ఒడిని పడతానుండమ్మా... నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా ఏ కొమ్మకు పూచావో  ఏ కమ్మని తేనెలు తెచ్చావో .. ఏ పాటకు మురిసేవో  ఏ తేటికి విందులు చేసేవో ఆ పాట గానో,తేటిగానో  పది నాళ్ళున్నాచాలమ్మా ..  నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా... నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు...

చెక్కర కలిపిన తియ్యని తెలుగు భాష.

https://youtu.be/2cFsZTXLdwY చెక్కర కలిపిన తియ్యని తెలుగు భాష.

నమ్మకు నమ్మకు

నమ్మకు నమ్మకు సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి వెచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోని రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనక నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి కలలే వలగా విసిరే చీకట్లను వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో