పోస్ట్‌లు

సెల్యూట్ సెల్యూట్

సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్ సుందరయ్యా రెడ్ సెల్యూట్ చల్లనయ్యా  సెల్యూట్ అందరయ్యా  శ్రమజీవుల తండ్రివయా//2// ఓఓఓఓఓఓ.... హోహోహోహో... నీ పేరు వింటే నిన్ను తలుచుకుంటే ఉత్సాహం ఉత్తేజం ఉరకలేస్తాయి //2// నిరాశా నిస్పృహలు ఎదురైనప్పుడు అపజయాలు బాధిస్తున్నప్పుడు కమ్యూనిస్టు ధీరత్వాన్ని సడలని ఆత్మస్థైర్యాన్ని నింపుతావు మా గుండెల్లో బిగిసిన పిడికిళ్లలో... సెల్యూట్       సుందరయ్యా  రెడ్ సెల్యూట్  చల్లనయ్యా  సెల్యూట్       అందరయ్యా                      శ్రమజీవుల తండ్రివయా//2// నిస్వార్థ రూపమా నిలువెల్ల త్యాగమా నిరాడంబర జీవితానికి నిలువెత్తు సాక్ష్యమా //2// శ్రమజీవుల శక్తికి నీవు పోరాడే ధైర్యం ఇచ్చావు సిద్ధాంత స్వచ్ఛతకు సమరశీల ఉద్యమాలకు నిలువుటద్దమునీవు మార్క్సిస్టు తత్వమైనావు సెల్యూట్       సుందరయ్యా  రెడ్ సెల్యూట్  చల్లనయ్యా  సెల్యూట్       అందరయ్యా                      శ్ర...

నడుస్తూ నడిపిస్తాడు

నడుస్తూ నడిపిస్తాడు లలల  కన్నీళ్లూ జయిస్తాడు లలలల మరణం లేని సిద్ధాంతానికి పుట్టిన వాడు //2// వాడే కమ్యూనిస్టోడు //4// మన జీవిత జతగాడు పెడదారిని మార్చేటోడు ప్రాప్త కర్మల రోగం కూల్చి మంచి బతుకునిచ్చేటోడు పేద గొప్ప భేదం లేని రాజ్యంకై పోరేటోడు త్యాగాల రూపం తానై  పోరుకు మనల నిలిపేటోడు వాడే కమ్యూనిస్టోడు //4// శ్రమయే జగతికి మూలం అంటూ ఆకలికెవ్వడు మాడొద్దంటూ చెమట చుక్కలా మిగులును చూపి దోపిడీని తెగ నరికేటోడు సిద్ధాంతం ఊపిరి వాడు స్థితిగతులు తెలిసినవాడు అందరికీ అన్నీ దక్కాలంటూ చీకటి  గెలిచే వెలుగులరేడు వాడే కమ్యూనిస్టోడు //4// ఎండా వాన సుడిగాలైన వరదకరువులు ముంచి పోయినా అండగా వెంట నిలిచేటోడు బొందిలో ప్రాణం నిలిపేటోడు సాగుభూమిలో గింజైనాడు కూలి పనుల్లో కూడైనాడు గుడిసె జాగలో జోతైనాడు గుండెలో ఎర్రజెండైయినాడు వాడే కమ్యూనిస్టోడు //4// మతోన్మాదాన్ని ఎదిరిస్తాడు సర్వ మతాలు ఒకటంటాడు సహజీవనము సామరస్యము మానవత్వము వెలుగంటాడు సుఖ సౌఖ్యాలు దక్కాలంటే సోషలిజం మార్గం అంటూ మార్క్సిజాన్ని  బాటగ చేసి బతుకునూ గెలవ మంటాడు వాడే కమ్యూనిస్టోడు //4//

ఇచ్చోటనే సత్కవీంద్రుని

      ( సత్య హరిశ్చంద్ర స్మశాన ఘట్టంలో పాడే పద్యం) సీ ll ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని      కలము నిప్పులలోన కరగి పోయె  యిచ్చోటనే భూములేలు రాజన్యుని         అధికార ముద్రిక లంతరించె  యిచ్చోటనే లేత యిల్లాలి నల్ల పూ         సల సౌరు గంగలో కలసి పోయె యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుగొన్న         చిత్ర లేఖకుని కుంచియ నశించె  తే ll ఇది పిశాచులతో నిట లాక్షణుండు  గజ్జ కదిలించి యాడు రంగస్థలంబు యిది మరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ అవని బాలించు భస్మసింహాస నంబు ll ___గుఱ్ఱం జాషువా

ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే

ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ తేడా లేనే లేవులే లేవులే... మిన్ను నున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది....  మన్నుల నుండి అన్నం తీసే మహిమ నీకున్నది మింటి చుక్కలల్ల వాడు చెమట చుక్కలల్ల నువ్వు  ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే  నీకు మచ్చ తేడా లేనే లేవులే. లేవులే... వాన కాలమోస్తె మబ్బుకప్పుకొని మరుగాయే జాబిలి నవ్వు... వానళ్ళ వరదల్ల బురద జల్లి వున్నా మసక జాబిలి నువ్వు  మేఘాల సొగసు వాడు మాగని తేజస్సు నువ్వు  ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే  నీకు మచ్చ తేడాలేనే లేవు లే...లేదులే.. రోజుకొక్క రంగు మారిపోతుంది పున్నమి వెన్నెల దీపం  పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టెడు కష్టాల రూపం  అమవాస నెలవంక వాడు ఉపవాస నెలవంక నీవు ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే  నీకు మచ్చ తేడా లేనే లేవు లే...

అగ్ని సరస్సున వికసించిన వజ్రం మేడే

చిత్రం
       అగ్ని సరస్సున వికసించిన వజ్రం మేడే                                           కార్మికుల త్యాగాల కొలిమిలో పుట్టింది మే డే..                   మేడే కార్మికులకు పండుగ దినం కాదు.                    అది కార్మికుల హక్కుల దీక్షా దినం                 " ప్రపంచ కార్మికులారా! ఏకం కండి! పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప" అంటూ '8 గంటల పని కోసం కార్మిక వర్గం కదం తొక్కిన దినం మేడే. త్యాగాలబాటలో ఎర్రబాటలో పోరాడి హక్కులను సాధించుకున్న దినం మేడే. ఇది అంతర్జాతీయ దినం. ప్రపంచ కార్మికులందరూ ముక్తకంఠంతో నినదించే సమైక్యతా దినం మేడే             మేడే స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కార్మిక సంఘాలన్నీ ప్రదర్శనలు, బహిరంగసభలు జరుపుతూనే ఉన్నాయి. ఇలా మేడేకు ప్రాము...uఖ్య త  ఎలా వచ్చి...

శత్రువు ఒకడుండాలె!

శత్రువు ఒకడుండాలె!  కాలం నదిలో  నీ ఎదురీతను చూసి నవ్వడానికి శత్రువు ఒకడుండాలె! అపుడే నీవు గమ్యం చేరగలవు! గుడ్డుపైన కోడిపెట్ట పొదిగితేనే కోడిపిల్ల బయటికొచ్చినట్టు నీ గుండెపైన శత్రువుమాట గుదిబండలా మారితేనే ఏ నిద్రపట్టని రాత్రో ఓ వెలుగుగెలుపుకిరణం నీలో తళుక్కుమంటుంది! మాటలపువ్వులు నీపై విసిరేవాళ్ళంతా మంచి మిత్రులనుకోకు! పూలవెనుక ముళ్ళున్నట్టే మిత్రులముసుగులో శత్రువులుంటారు! నీ శత్రువు ఎవరోకాదు ఒకప్పటి నీ మిత్రుడే! చిన్నబండను చూసి కుక్క మొరగదు కదా! అది పెద్ద కొండను చూసే ఊరికే అలా మొరుగుతుంటుంది! అకారణ ద్వేషంతో నిన్ను ఎవడైనా నిందిస్తున్నాడు  అంటే నీ ఎదుగుదలే వాడి మానసిక అశాంతికి కారణమై ఉంటుంది! వాడు శత్రురూపంలో ఉన్న మిత్రుడే అన్న మాట! పాపం వాడు తన విలువైనకాలమంతా నీ గురించే ఆలోచిస్తున్నాడంటే... నీకర్తవ్యపు నెగళ్ళను ఎగదోస్తూ నిన్నో మండే సూర్యుడిని చేస్తున్నాడన్నమాట! ముళ్ళకంచె లేకుంటే పూలతీగ ఎలా పైకెగబ్రాకుతుంది? ఎవడు ఏ రంగంలో ఎదగాలన్నా వాడికో శత్రువుండాలి సుమా! గాలి ఎక్కువైన టైర్ ప్రేలిపోతుంది ఏది ఎక్కువైనా మనిషి కూలిపోతాడు! టైరులో ఎంతగాలి ఉండాలో మెకానిక్ కు తెలుసు! నీకేమిచ్చి బ...

తూరుపు తెలవారుతుంది ప్రతి దినం

తూరుపు తెలవారుతుంది ప్రతి దినం  కాలం గతి మారుతుంది ప్రతీ క్షణం మంచి మార్పు లోకానికి మంగళ దాయకం  అది వికటించిందా...!  లోకానికి అభ్యుదయవినాశకం  ప్రసరించే గాలికి లేదు కులం ప్రవహించే నీటికి లేదు మతం  కులం పేర మతం పేర జరిగే కలహాలు  మనిషిని పశువుగ మార్చే విష వలయాలు  తూరుపు తెలవారుతుంది ప్రతి దినం కాలం గతి మారుతుంది ప్రతీ క్షణం ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది చీకటి, ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యువు ఏది పుణ్యం, ఏది పాపం ఏది నరకం, ఏది నాకం  ఓ మహాత్మా , ఓ మహర్షి ఏది సత్యం, ఏదసత్యం ఏదనిత్యం, ఏది నిత్యం ఏది ఏకం, ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా , ఓ మహర్షి