పోస్ట్‌లు

కథలు రాయటం ఎలా?

చిత్రం
'కథలు రాయటం ఎలా? అన్న ప్రశ్నకు సరియిన సమాధానము: నేనెలా కథలు రాశానోచెప్పటమే అనుకుంటాను. ప్రతి మనిషి జీవితంలో 'ఈ అనుభవం ఆధారంతో ఓ కథ రాస్తే బావుండును అనుకునే క్షణాలు ఎన్నో ఉంటాయి. అయితే చాలామంది అలా అనుకోవటంతోటే ఆగిపోతారు. వారిలో కొద్దిమంది మాత్రమే నిజంగా కథలు రాస్తారు. ఇంకా కొద్దిమంది మాత్రమే తాము రాసిన కథల్ని ప్రచురించుకోగల్గుతారు. కథ రాయాలని ఎప్పుడనిపిస్తుంది? ఎందుకనిపిస్తుంది? అన్న అంశాన్ని పరిశీ భించాలి. ఎందుకంటే ఏ గొప్ప కథకైనా కథ రాయాలని ఓ కథకుడికి అనిపించటంతోటే బీజం పడ్తుంది. ఏదైనా ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. లేదా ఓ అసాధారణ వ్యక్తి కనిపిస్తాడు. వీటిని కొందరు ప్రత్యక్షంగా చూస్తారు. కొందరు పక్కవాళ్ళు చెప్పుగా వింటారు. కొందరు పత్రికల్లో చదువుతారు. ఆ సంఘటన పట్ల లేక ఆ వ్యక్తిపట్ల ఒక్కొక్కరూ ఒక్కొన్న రకంగా స్పందిస్తారు. ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవాళ్ళు దానిని గూర్చి ఇతరులకు చెబుతున్నప్పుడే అదొక కథగా మారుతుంది. ఎవరూ తాము చూసిన సంఘటనను పూర్తిగా జరిగింది జరిగినట్టుగా చెప్పరు. ఆ చెప్పటంలో తమదైన వ్యక్తిత్వాన్ని కొంత జోడిస్తారు. ఆ సంఘటన అలా జరగటానికి కారణాలేమిటో, అందు...
 అభ్యుదయ రచయితల సంఘనిర్మాణంలోనే  ప్రధానమైన లోపం వుంది. అరసం సభ్యులందరూ సాహిత్యకులే. కాని, వారందరికీ ఒకే రకమైన సామాజిక దృక్పథంగానీ, సాహిత్య లక్ష్యంగానీ లేదు. కానీ అభ్యుదయ సాహిత్యానికి ఒక స్పష్టమైన సామాజిక రాజకీయ చారిత్రక సిద్ధాంతం అనివార్యమైన ప్రాతిపదిక.  అరసం నిర్మాతలు ఈ విషయంలో ఉదారవైఖరిని, విశాలదృష్టిని చూపించినందువల్ల అభ్యుదయ భావనాస్పర్శ ఏమాత్రమూలేని విశ్వనాథవంటి రచయితలకు, ఫ్యూడల్ వ్యతిరేక సాహిత్యం సృష్టించిన బూర్జువా రచయితలకు అభ్యుదయ రచయితల సంఘంలో గౌరవ స్థానం లభించిందని యాకూబ్ పేర్కొన్నారు.

నవలా సాహిత్యం

చిత్రం
నవలా సాహిత్యం ఆధునిక సాహిత్యం మొదట నవలా సాహిత్యంతో ప్రారంభమైంది. ప్రపంచంలో వెయ్యేళ్ళ క్రితం రాసిన 'గెంజీ కథ' మొట్టమొదటి నవల. ఇది జపాన్‌ దేశపు ఇతిహాసం. ఆ తరువాత ఆంగ్ల సాహిత్యంలో మొట్టమొదట డేనియల్‌ డెఫో రాసిన 'రాబిన్‌సన్‌ క్రూసో' నవల 1719లో వచ్చింది. ఇది రాబిన్‌సన్‌ సాహసవంతమైన వీరోచిత జీవితాన్ని వర్ణిస్తుంది. ఆంగ్లంలో 'నావల్‌' అనే పదం ఉంది. దీని ఆధారంగా తెలుగులో 'నవల' అనే పేరు వచ్చింది. నవల జీవిత వాస్తవికతను, జీవితంలో ఉన్న వైవిధ్యాన్ని, సంక్లిష్టతను, వైరుధ్యాలను చిత్రిస్తుంది. ఇదొక సృజనాత్మక ప్రక్రియ. 'నవీన విశేషాలు కలిగిన గద్య ప్రక్రియ నవల' అని మొట్టమొదట కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి 'నవల' ను నిర్వచించాడు. 'రచనా కాలం వచ్చిన వాస్తవాలను, ఆచారాలను చిత్రించేది నవల' అని బోదపాటి కుటుంబరావు 'ఆంధ్రనవల - పరిణామం' అన్న గ్రంథంలో పేర్కొన్నాడు.        నవలకు ఉండాల్సిన ముఖ్య విషయాలు నాలుగున్నాయి. 1. కథ 2. కథావస్తువు 3. పాత్రలు 4. నేపథ్యం. నవలను గద్య కావ్యమని పులువురు పేర్కొన్నారు. బ్రిటీషు వారి రాకతో మనదేశంలో ఆంగ్ల విద్యా ప్రభావ...

బహుజన సామాజిక తత్వవేత్త బిఎస్ రాములు

చిత్రం
     బి.ఎస్.రాములు .BSRamulu                     కవి, కథా రచయిత, నవలా రచయిత, సాహితీవేత్త, సామాజిక కార్యకర్త, ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్త, తెలంగాణ రాష్ట్ర బీ సి కమిషన్ మాజీ  అధ్యక్షులు బి. ఎస్. రాములు విశాల సాహిత్య అకాడమీని స్థాపించి వందలాది రచయితలకు అవార్డులను ప్రధానం చేసి ఎందరో యువ రచయితలకు  ప్రేరణ గా నిలిచారు. అంతే గాక బౌద్ధo, మార్కిజo,  అంబేద్కరిజం, మానవతావాదం, స్త్రీవాదం, బహుజనవాదం, వీటన్నింటినీ సమన్వయo చేస్తూ ఒక నూతన తాత్విక చింతన ను ప్రతిపాదించిన తత్త్వవేత్త బి ఎస్ రాములు. ఆయన కృషి బహుముఖీనం.        అతనిది ఓ ప్రత్యేక శైలి, ప్రత్యేక దృక్పధం. సమాజ స్థితిగతులను తనదైన శైలిలో  అనేక కథలుగా అందించి సాహిత్యలోకంలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించిన సామాజిక సాహిత్య కారుడు.       "కవిని పరిణతి మానవునిగా చేసేదే తత్వశాస్త్రం " వాక్యం రసాత్మకం కావ్యం "అన్నాడు  విశ్వనాథుడు. ' పరిణతి వాక్యమే కవిత్వం / అతడొక పరిణత వాక్యావళి/ అతను విశ్వకవితా విహారం చేస్తున్...

ఆధునికం అంటే

చిత్రం
https://slideplayer.com/slide/6331672/ ఒక సమాజాన్ని లేదా ఒక దృష్టికోణాన్ని 'ఆధునికం' అని ఎప్పుడు అనగలం? కనీసం ఈ కింది నాలుగు లక్షణాలుంటే అనగలం. 1). వ్యక్తులందరికీ స్వంత హేతుబుద్ధిని నిర్భయంగా ఉపయోగించగల స్వేచ్ఛ. 2). వ్యక్తిని అన్ని రకాలుగా  ఒత్తిడి పెట్టే  సంప్రదాయ నిరంకుశ సముదాయం నుండి స్వేచ్ఛ. 3). తనకు నచ్చిన జీవితానందాన్ని వెతుక్కునే , తనకు నచ్చిన కళారూపాల్లో తన్ను తాను వ్యక్తం చేసుకోగలిగే స్వేచ్ఛ. 4). మనిషి ఎలా బతకాలో ఆదేశించే ధర్మశాసనాల నుండీ  , అశాస్త్రీయ నియమావళుల నుండి స్వేచ్ఛ. (from facebook wall of bargava)

భారతీయ సంస్కృతి

చిత్రం
భారతీయ సంస్కృతి "సంస్కృతి" అంటే ఆచారం. అంటే జీవిత విధానం. ఇంగ్లీషులో సంస్కృతిని "కల్చర్" అంటారు.కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం  కల్చుర  లేదా  కొలెరె   నుండి వచ్చాయి. దీని అర్థం "సాగు" . కోలెరె  అనే పదం  అర్థం 'పండించడం'. దీనిని బట్టి ఈ పదాలు వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయని తెలుస్తుంది. ఒక సమాజంలో ఉన్న పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. మధ్య యుగాలలో, సంస్కృతి అంటే భూమి ని సాగు చేసే విధానం. పునరుజ్జీవనోద్యమంలో "పండించిన" మనిషి వికాసం గా మారింది.అవి సాహిత్యం, లలిత కళలకు సంబంధించినదిగా మారింది.19 వ శతాబ్దంలో, సంస్కృతిలో మంచి,మర్యాదలు, ఆచారాలు కలిశాయి. ఇప్పుడు సంస్కృతి లో విలువలు, నమ్మకాలు, భాష మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా వచ్చి చేరాయి. సంస్కృతి  డైనమిక్  గా ఉంటుంది. అంటే  సంస్కృతిలోని అంశాలు రూపాంతరం చెందుతాయని అర్థం. అంతేగాక అవి ఇతర సంస్కృతుల ప్రభావానికి లోనవుతాయి కూడా. సంస్కృత భాషలో " సంస్కృతి" అంటే "సంస్కరణ చెందిన విషయం” అని అర్థం. "సంస్కరణకు" అర్థం చెడులో ఎంతో కొం...

ఏది అసలైన కవిత్వం?

చిత్రం
ఏది అసలైన కవిత్వం? ఇవాళ ఏది సుకవిత్వమో !.ఏది కుకవిత్వమో తెలియక కొత్త కవులు తికమక పడుతున్నారు.అసలు కవిత్వమే కాని కవిత్వానికి పురస్కారాలు ఇవ్వడం,ఏవో కొన్ని వాక్యాలు పేర్చి వాటిని కవిత్వంగా అచ్చు వేయడం.ఆపై వాటిపై సమీక్షలు వ్యాసాలు రావడం..చిన్న పెద్ద పత్రికల్లో ముద్రించుకొని మురిసిపోవడం...దాన్ని గొప్ప కవిత్వంగా భ్రమింపచేయడం.ఇవాళ తెలుగు కవిత్వంలో జరుగుతున్న మార్కెటింగ్ తంతు.కవితను ఎలా నిర్మించాలో..ఎలాంటి కవితా నిర్మాణాలు అనుసరించాలో తెలియకపోయినా...చే.రా.అన్నట్టు" కొన్ని గారడి వాక్యాలు,హాస్యోక్తులు,ప్రశ్నార్థకవాక్యాల్ని పదే పదే రిపీట్ చేయటం,సింబాలిక్ పేరిట అయోమయ సంకేతాలు గుప్పించడం," కవిత్వం కాదు.ఒకే వస్తువుకు ఏళ్ళ తరబడి సానపెట్టడం(కాలంలో వచ్చిన మార్పులు గమనించకుండ)ఇంకా శ్రీ శ్రీ లాగో,సి.నా.రె లాగో,తిలక్, అజంతాల లాగా కవితలు రాయాలని చూడటం ఇవన్నీ..నేడు ప్రీవర్స్ రాస్తున్న వాళ్ళు చేస్తున్న ట్రిక్కులు.అందుకే చే.రా.ఏనాడో భావ,అభ్యుదయ,విప్లవ,కవుల ఖండికల సంపుటులు మహా కావ్యాలుగా భ్రమపడకూడదన్నారు.రా.రా.లాంటి విమర్శకులు తిలక్ మంత్ర లోకపు మణి స్తంభాల కవిత్వాన్ని అసలు కవిత్వమే కాదని...