జయప్రద
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి లో పుట్టిన లలిత రాణి 1975 లో భూమికోసం సినిమా తో తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చింది. ఆ సినిమాలో నటించిన దానికి ఆమె కు ఇచ్చిన పారితోషం పది రూపాయలు. అది తిలక్ గారు నిర్మించిన సందేశాత్మిక చిత్రం కావడం తో చాల మంది పెద్దలు సినిమా ప్రివ్యూ కి వచ్చారు. దర్శకులు బాలచందర్ గారి దృష్టి ఆమె పై పడింది, 1976 లో అంతులేని కధ సినిమా కు ఆమె ను కథానాయకిగా తీసుకున్నారు. ఆ సినిమా విజయవంతం అయ్యింది, 1977 అన్న ఎన్టీఆర్ తో తొలిసారిగా అడవిరాముడు చిత్రం లో కధానాయకిగా నటించింది, అది అఖండ విజయం సాధించింది, . సినిమాలలోకి రాకముందే ఎన్టీఆర్ అభిమాని అయినా జయప్రద ఆయనతో కథానాయకిగా నటించడం తన పూర్వజన్మ సుకృతం అని చెప్పేది. సిరిసిరి మువ్వ విడుదల అయిన తరువాత ఎన్టీఆర్ జయప్రద ను పిలిపించి తన చాణిక్య చంద్ర గుప్త లో కీలకమైన విషకన్య పాత్ర ను ఇచ్చారు. ఆ సినిమా విజయం తో ఎన్టీఆర్, జయప్రద లకు మంచి జంట గా పేరు వచ్చింది . యమగోల చిత్రం నుంచి వీరి కాంబినేషన్ కు డిమాండ్ పెరిగింది. ఈ తరం హీరోయిన్ లలో అన్న ఎన్టీఆర్ తో పౌరాణిక, జానపద, చరితాత్మిక , సాంఘిక చిత్రాలలో నటించిన ఘనత ఒక్క జయప్రద సాధించింది. 8 బాషలలో దాదాపు 300 సినిమాలలో నటించింది. ది resine అనే సినిమా హిందీ, ఇంగ్లీష్, చైనీస్ భాషలలో నిర్మించగా అందులో జయప్రద కథానాయికగా నటించింది, ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రసీమలలో అత్యున్నత స్థాయి కి ఎదిగింది, ఎన్టీఆర్ ఆశయాలు, ప్రజాసేవ చేయాలన్న తపన చూసి తాను కూడా తెలుగుదేశం పార్టీ లో చేరింది. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పార్టీ కి సేవ చేసింది, 1996-2002 వరకు తెలుగు దేశం రాజ్య సభ మెంబెర్ గా ఎన్నుకోబడింది. . , 2004 లో సమాజ్ వాది పార్టీ లో చేరి, ఉత్తరప్రదేశ్ రాంపూర్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టింది. 2014 లో ఆ పార్టీ చీలిపోవడం తో ఎన్నికలలో ఓడిపోయింది. మార్చ్ 2019 లో BJP లో చేరి ఎన్నికల ప్రచారం పాల్గొన్నది. ఆంధ్రా లో పుట్టి, UP రాష్ట్రం నుంచి పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం , అభినందించవలసిన విషయం. ప్రఖ్యాత సినీ దర్శకులు సత్యజిత్ రే సినిమా కధానాయకులలో అత్యున్నత అందాలరాశి జయప్రద అని వ్యాఖ్యానించారు. . ఎన్టీఆర్, జయప్రద , అందాల జంట గా నటించిన సినిమాల వివరాలు. 1. అడవిరాముడు . 2. చాణిక్య చంద్రగుప్త . 3. మా ఇద్దరి కధ . 4. యమగోల. 5. మేలుకొలుపు. 6. యుగపురుషుడు . 7. రాజపుత్ర రహస్యం . 8. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం . 9. ఛాలెంజ్ రాముడు. 10. సర్కస్ రాముడు. 11. సూపర్ మ్యాన్ .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి