ఫ్యూడల్ మనస్తత్వం



ఫ్యూడల్ మనస్తత్వం 



నా తర్వాత నా సంతానం ముఖ్యమంత్రి/ ప్రధాన మంత్రి కావాలనుకోవడం, తర్వాత అయన సంతానం మఖ్యమంత్రి కావాలని ప్రజలు అనుకోవడం.కుటుంబ వారసత్వాలు అధికారంలో కొనసాగడం ఆసియా దేశాల్లో ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఎక్కువ.
             
          వారి వంశం గొప్పది.ఆ వంశంలో పుట్టిన రాజు కొడుకు గొప్పవాడు.ఆ వంశం అయితేనే రక్షణ.ఆ వంశపాలన మంచిది.తండ్రి మంచివాడు కాబట్టి కొడుకు మంచివాడు.తండ్రి ఆస్తి కొడుక్కే రావాలి కదా.
వాళ్ళ రాజ్యం వారికే చెందాలి.ఆయనదే అధికారం కాబట్టి ఎదురు తిరగడం మంచిది కాదు.ఆ వంశం అయితేనే మనకు మంచిది.రాజే అన్నీ చూస్తాడు.

ఇదీ ఫ్యూడల్ మనస్తత్వ సారం.
                ***
ఇక్కడ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఉద్యమాలు రాలేదు.
ఫ్యూడల్ మనస్తత్వం మారలేదు.పారిశ్రామిక అభివృద్ధి తక్కువ.ప్రజల్లో వైజ్ఞానిక పునర్వికాసం రాలేదు. 

మత ప్రభావం తగ్గలేదు.

ఇక్కడి ఫ్యూడలిజాన్ని పునర్వికాసం పొందిన యూరోపియన్లు పడగొట్టారు.
యూరోపియన్ వారికి వ్యతిరేకంగా మత భావనలు పెరిగాయే కానీ, తగ్గలేదు.

ఇక్కడ జ్ఞాన పునర్వికాసం రావలసి ఉంది.

అందుకే రాజులు లేకపోయినా రాజరికపు లక్షణాలు అందరిలో కనిపిస్తుంటాయి.
ఇక్కడ మతాన్ని, రాజ్యాధికారం నుండి వేరు చేయవలసి ఉంది.

ఆధునిక వైజ్ఞానిక విప్లవం ఆధారంగా సాంస్కృతిక భావ విప్లవం రావాలి.



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు