దీన్ని ఏ వైరస్ అంటాం?

1720__ ప్లేగు_ ఫ్రాన్స్ _ లక్ష
1820__కలరా_యూరప్_లక్ష
1920__స్పానిష్ ఫ్లూ_1 కోటి
2020__కరోనా_ఇప్పటికీ 4000


ప్రతి 100 సంవత్సరాలకు..ఒక వ్యాధి ప్రపంచాన్ని సవాల్ చేస్తూ ఉంటుంది.... వీటితోపాటుగా గత 20 సంవత్సరాలలో  పది రకాల వైరస్ లు వచ్చి  వేల మంది ప్రాణాలను బలిగొన్నది. పై అన్నింటికీ ప్రపంచ మేధావులు మందులు కనుగొన్నారు . మన దేశంలో ఆకలి చావులు, రైతులు ఆత్మహత్యలకు మందులు లేవు. ఎందుకంటే పై చావులు అన్నింటికీ వైరస్ కారణమైతే మన దేశంలో  పేద ప్రజల ఆకలి చావులకు‌,  రైతుల ఆత్మహత్యలకు స్వతంత్ర భారతదేశంలో 74 సంవత్సరాల పరిపాలిస్తున్న మన పాలకులు అవలంభిస్తున్న ప్రభుత్వ విధానాలే కారణం. అందుకే కాలం సృష్టించిన ఈ వైరస్ కు మందులు కనిపెట్టవచ్చు. కానీ మన పాలకులు అవలంబించిన విధానాల వల్ల చనిపోతున్నా దీనికి ఏ మందు కనిపెడతారు. దోపిడీ దారుల ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వాల విధానాలను  ఓడించగలిగితే ప్రజల  ఆకలి చావులు, రైతులు ఆత్మహత్యలు నివారించగలుగుతాం

మన దేశంలో గత 20 సంవత్సరాలుగా  వివిధ రకాల వైరస్ లు వచ్చి  ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నాయి.

2001 ఆంథ్రక్స్
2002 వెస్టనిలే వైరస్
2003సార్స్
2005 బర్డ్ ఫ్లూ
2009 స్వైన్ ఫ్లూ
20014 ఎబోలా
2015 జికా
2018 నిఫా
2020 కరోనా వైరస్....

పైన చెప్పినవన్నీ వాతావరణంలో వచ్చిన మార్పులు,  కాలుష్య ప్రభావం వల్ల వచ్చే వైరస్ లు.

కానీ మనదేశంలో ప్రభుత్వ విధానాల వలన వ్యవసాయ  రంగం దెబ్బతిని గత 25 ఏళ్లుగా మూడు లక్షల 50 వేల మంది ఏ జబ్బు లేకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకునే  స్థితి ఎందుకు వచ్చింది? దీన్ని ఏ వైరస్ అంటాం?


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు