నవ్వు నవ్వించు

హాయ్ 
        ఒకసారి నవ్వరూ.  . ప్రముఖ వైద్యుడు డా.మదన్ కటారియా నవ్వుల మహిమను గుర్తించి మొదటి సారిగా  ముంబయి లో  మే,10 ,1998 న  ' ప్రపంచ నవ్వుల దినం' ప్రారంభించారు.
      ' నవ్వు నాలుగు విధాలా చేటు ,' అన్నది ఎవరో తెలియదు కాని ' నవ్వు నాలుగు విధాల గ్రేటు " అన్నది మాత్రం  మన జంద్యాల గారే.అనటమే కాదు, సున్నిత హాస్యంతో గిలిగింతలు పెట్టి మరీ నిరూపించారు.
        సృష్టి లో నవ్వగలిగినది మానవజాతేనని భుజం తట్టుకుంటాం కదా.కాని,కాదట. అదంతా ఒహ్ ఒ ట్టి భ్రమేనని అధ్యనాలు తేల్చి మరీ చెప్పేశాయి. మన పూర్వీకులు...... అదేనండి,చింపాంజీలకు గిలిగింతలు పెడితే కిచకిచ( మన భాషలో హ హ హఁ) మని నవ్వేస్తాయట తెలుసా? ప్రతి ప్రాణి కూడా మనలాగాఅరనవ్వులు,వికటాట్ట హాసాలు చేయవుగాని  వాటి భాషలో నవ్వుతాయట.వాటి నవ్వు శబ్దాలు వాటివి!
       మనం  ఒంటరిగా ఉన్నప్పటి కంటే పది మంది తో కలిసి ఉన్నప్పుడు 30 రెట్లు ఎక్కువ నవ్వుతామట.ఇంకొక ముఖ్య విషయం మగవారి కంటే ఆడవారు ఎక్కువ నవ్వుతారట.మనసు దోచుకున్న మగువను నవ్వించడానికి మనవాళ్ళు నానా తంటాలు పడితే, అతివలు తమకు నచ్చిన వాడి సన్నిధిలో అధికంగా నవ్వులు కురిపిస్తారట.ఇంకొక  విషయం ఏమంటే  ' ఎ' సర్టిఫికేట్ జోకులు మగవారిని ఎక్కవగా చక్కలిగింతలు పెడితే, మహిళలు మాత్రం మంచి హాస్య రసం ఒలికే జోకులకే ఓటు వేస్తారట ఈ ' అట' నవ్వుల మీద అధ్యయన ఫలితాలు.తమమీద తాము జోకులు వేసుకుని నవ్వుకోగలిగినవారికి ఆత్మవిశ్వాసం అధి కం అట, sence of humour ఉన్నవాళ్ళే ఎక్కువ సామర్థ్యం తో పని చేస్తారని  మరో అధ్యయనం తేల్చిచెప్పింది.
        ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ' నవ్వే ఆడదాన్ని,ఏడ్చే మగవాడిని నమ్మకూడదు ' అనే లోకోక్తి ని  చాల మంది  అపార్థం చేసుకుంటున్నారట. నవ్వే ఆడది అంటే   ఇక్కడ.....సంసారం గుట్టు రోగంరట్టు అన్నరు కదండి. సంసార సాగరంలోని  కష్టాలలో కూరుకు పోయి,ఆబాధనంతా గుండెల్లో నే అదిమి పట్టి ఆడవాళ్ళు పైకి మాత్రం అంతా క్షేమమే అన్నట్టు నవ్వుతారట.కాబట్టి ఆనవ్వు నిజం కాదు ఆ నవ్వుని నమ్మవద్దు అంటున్నారుట. ఇక ఏడ్చే మగవాడి సంగతి..... మగవారు శాడిస్టులట, ఎదుటి వారు బాగుంటే ఓర్వలేని వారూనట(   నేను కాదండోయ్ చెప్పటం  ,అధ్యయనాలే) అందుకే ఏడుస్తారట.  సో అది నిజం ఏడుపని మనం నమ్మ కూడదు అని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా సానుకూల దృక్పథం ఉన్నవాళ్ళు హాయిగా నవ్వగలరట,  ఇంకా సర్దుబాటు మనస్తత్వం ఉన్న వారుకూడా.  హాయిగా నవ్వు తూ ఆనందంగా,ఆరోగ్యం గా ఉండాలన్న మాట. ఏది ఒకసారి నవ్వండి . సరే ,ఇది చూడండి.... ‌న..వ్వు  ..తున్నా...రు,న..వ్వు..తున్నారు,,..చూసారా  ,నవ్వేసారు. థాంక్యు 🌹

కామెంట్‌లు

  1. కార్పొరేటికరణ యుగంలో సహజమైన నవ్వును మెజారిటీ ప్రజలు కోల్పోయారు. సోషల్ మీడియా,టెలి, ఫిలిం మీడియా లలో వచ్చే హాస్యం సహజత్వాన్ని కోల్పోయి,వెగటుగా, జుగుప్సగా ప్లాస్టిక్ పూ లు పూచినట్లు గా,భరించలేక పోతున్నాము. సమాజంలో వేగం పెరిగింది. పనికిరాని ఈ వేగం తగ్గాలి మళ్లీ పూర్వపు సహజమయిన నటువంటి నవ్వులు స్థాయిని అందరూ పొందాలని ఆకాంక్షిస్తూ... నవ్వుల దినోత్సవం సందర్భంగా మంచి వ్యాసం వెలువరించారు మీకు సర్వదా అభినందనలు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు