విరుద్ద
అన్నింటి సాఫల్యం
నేను ముద్రించుకున్న నవ్వు
ఒక నవ్వు కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాను నేను
____ వెంకటకృష్ణ
ఇక్కడ ఉషోదయంలో ఉషస్సు లేదు
ఊసర క్షేత్రం ఇది
ఆకాశం నెర్రెలుగా చీలి నిరాశను బొట్లుగా చిలికిస్తున్నది
_ ఏ ఎన్ నాగేశ్వరరావు
గుండెలో పూల తోటలు పెంచుకున్న వాడు
ఎప్పుడూ నవ వసంతాల్ని కలగనే వాడు
వాడు మాత్రమే కోకిల కూత వినగలడు
__అద్దేపల్లిరామ్మోహనరావు
వెలుతురు లేదు, ఆశ లేదు అవతలేముందో తెలియదు సముద్రపుటంచును ప్రేమిస్తున్నాను
__ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
అవిశ్రాంత జీవన గమనంలో కాసేపు ఆగి అటు వైపు చూడాలి
బతుకు తోటలో విచ్చుకుని పరిమళ భాషతో పిలుస్తున్న పువ్వును పలకరించాలి ఉరుకులు పరుగులతో పోతున్న మనం
కాస్త విశ్రాంతిని కాస్త విరామాన్ని ఏర్పరుచుకోవాలి
అర్థం లేని జీవితానికి అర్ధాన్ని వెతుక్కోవాలి
విలియంహెన్రీడేవిస్ (1870_1940)
నేను కొన్ని ప్రమాణాలు చేశాను నేను నిద్ర పోయే ముందు ఎన్నో మైల్లు నడవాలి
నేను నిద్ర పోవడానికి ముందు ఎంతో దూరం వెళ్ళాలి
___రాబర్ట్ ఫ్రాస్ట్ (1874 _1963)
కవిత్వం
ఆనందంలో మొదలై వివేకంలో అంతమవుతుంది
__రాబర్ట్ ఫ్రాస్ట్ (1874_1963)
ఢిల్లీలాంటి నగరమొకటి
తనలోని చెత్తనంతా
ఒకానొక అద్భుతమైన చీపురుతో
ఊడ్చి పారేసుకుని శుభ్రపడి
విజయ గర్వంతో నవ్వుతుంది
ఢిల్లీ నగరం చేతుల్లో వున్న
ఆయుధంలాంటి
ఒక చీపురుకోసం
ఎదురుచూస్తోంది నా దేశం
__ చిత్తలూరి
అదృశ్య హింసకు వ్యతిరేకంగా ఊహలకందని నిరంకుశత్వానికి వ్యతిరేకంగా
అన్ని రకాలనిర్బంధానికి వ్యతిరేకంగా ఉపన్యసించండి.
డబ్బు కోసం చచ్చేవాడిని అసహ్యించుకోండి.
పొలాలలో, నగర పొలిమేరల్లో ఇక్కట్లు పడే మహిళల దగ్గరికి కనబడని వైఫల్యాలతో కరిగిపోతున్న వాళ్ల దగ్గరకి వెళ్ళాలి.దురదృష్టవంతులైన సహచరులను పరామర్శించాలి. ప్రపంచంలోని నైరాశ్యం పై ప్రళయంలా విరుచుకు పడాలి.
స్నేహంతో సమీపించి మనసు విప్పి మాట్లాడాలి.
అన్ని రకాల నిర్బంధాలను అసహ్యించుకోవాలి.
__ఎజ్రా పౌండ్( 1885_ _1972)
ప్రేమకుస్థలంతో కాలంతో నిమిత్తం లేదు
ప్రేమ ఒక జీవనవిధానం మనుషుల్ని కలిపేది ప్రేమ ఒక్కటే మనుషులకు అవసరమైంది ప్రేమ ఒక్కటే
_డబ్ల్యూ హెచ్ ఆడెన్ (1907- 1973)_
ఓటమిని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి అంగీకరించాలి
బాధను మనస్ఫూర్తిగా స్వాగతించాలి
అప్పుడు దుఃఖం వస్తుంది దుఃఖం లొంగిపోతుంది
జీవితం కంటే ఏది గొప్పది కాదని
అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కొనే జీవితం అన్యాయాలపై చేసే పోరాటం
అన్నిటి కన్నా ఉన్నతమైనవని నమ్ముతాను
_డబ్ల్యూ హెచ్ ఆడెన్ (1907 _1973)_
ఇక్కడ ఈ ఆత్మ విశ్రాంతి కోరడం లేదు
ఇక్కడ ఏ మనిషి ఆకలితో బాధపడకూడదు
మా లక్ష్యం అదే
మనిషి మనిషిలాగా బతకాలని నేను కోరుకుంటాను
_*స్టీఫెన్ స్పెండర్*_(1905_ 1995)
బుద్ధి కర్మానుసారిణి(ఏ ఆలోచన వచ్చినా అది కర్మ(పని) ఫలితమే)
__ హైందవం
కర్మ బుద్ధ్యాను సారిణీ(ఏ కర్మ (పని)చేసినా అది మన ఆలోచనల ఫలితమే)
___బౌద్ధం
సత్తే
ఏహేయ్ సత్తే
అర్ సత్తే... ఏహేయ్ సత్తే... ఓహో సత్తే... అహా సత్తే
ఏ సత్తే ఏ గొడవ లేదు…
__సినిమాపాట(దేశముదురు)
ఎంతో మధురమీ జీవితం అంతేలేని అద్భుతం
అనుదినం అనుభవం పరువమే పరిమళం
_ సినిమా పాట (కాలేజీ బుల్లోడు)
బ్రతికినన్నినాళ్ళు వెతలు తప్పవు కదా!
మృతియె వెతలదీర్చు మేటి మందు.
___ గాలిబ్
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
ఒడిలో చెలి మోహనరాగం...
జీవితమే మధురానురాగం...
__ సముద్రాల
మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను
పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను
___ సినారె
ఎదురీదే చేతులుంటే
ఏరు దారులివ్వక ఏం చేస్తుంది ?
పయనించేఅడుగులుంటె బాటచేతులెత్తక ఏం చేస్తుంది ? తనకరాలుపరికరాలు తగిన పాళ్ళలో సమన్వయించుకొని
చూపునుసాచిస్తుంటే శూన్యం
శిరసొగ్గుక ఏం చేస్తుంది. ?
పిడికిలి పిండే మనిషికి ఎడారి
అలలెత్తక ఏం చేస్తుంది ?’
___ సినారె
*_విరుద్ధ_*
ఏమి వెదుకుతున్నావూ?
ఈ జీవిత శిథిలాల్లోనీవూ?
చెదిరిన నీ సుఖస్వప్నాలే అవి
రంగుల రంగుల గాజుపెంకులూ
బ్రతుకు పంటలో తాలుకంకులూ
పెంటపోగులో విశ్రమించినయ్
__ బైరాగి
ఓయి లతా ప్రవాసి! పద
వోయి జిలేబి గులాబి తోటలన్
బ్రేయసి బాహువల్లికల
బేశల కావ్య మరందగానముం
జేయుచు ఖేలగా జనుము
జీవితమే ఒక పూలబాటగా
హాయిగ తీయగా ఒక ఖ
యాముగ నీదు హయాము సాగుతన్
__ గుంటూరు శేషేంద్ర శర్మ
*_విరుద్ధ_*
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా
_ సముద్రాల
మాయంటావా? అంతా
మిథ్యంటావా?
నా ముద్దుల వేదాంతీ?
ఏ మంటావు?
మాయంటావూ? లోకం
మిథ్యంటావూ?
పాలికాపు నుదుటి చెమట,
కూలివాని గుండె చెరువు,
బిచ్చగాని కడుపు కరువు
మాయంటావూ?
__ శ్రీశ్రీ
*_విరుద్ధ_*
సజ్జితదానధర్మ గుణచారు విచారుడు, వైరిదార
ద్రుక్కజ్జలమార్చన ప్రథమకారణ చారు కృపాణపాణి ......రాజ్యము సేయుచుండగన్
__కొరవి గోపరాజు.(సింహాసనద్వాత్రింశిక.)
రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు...
_ ధూర్జటి
*_విరుద్ధ_*
బ్రాహ్మణోస్య ముఖ'మాసీత్ | బాహూ రా'జన్యః' కృతః |
ఊరూ తద'స్య యద్వైశ్యః' | పద్భ్యాగ్మ్ శూద్రో అజాయతః __పురుష సూక్తం
చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః _ భగవద్గీత
కసిరి బుసకొట్టు నాల్గుపడగల హైందవ నాగరాజు
__గుర్రంజాషువా
*_విరుద్ధ_*
మగడు వేల్పన పాతమాటది
ప్రాణసఖుడ నీకు
__ గురజాడ
పెళ్ళంటే పెద్ద శిక్షని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని
అర్థమైంది
____ సావిత్రి
*_విరుద్ధ_*
దిగిరాను దిగిరాను దివినుంచి భువికి దిగిరాను
నేనంతలోక తిమిర లోకైక పతిని
_ దేవులపల్లి కృష్ణశాస్త్రి
మీ కోసం కలం పట్టి ,
ఆకాశపు దారులంట
హడావుడిగా వెళిపోయే ,
అరచుకుంటూ వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్ ,
రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను !
భూకంపం పుట్టిస్తాను !
___శ్రీశ్రీ
గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్
_ నన్నయ
మంచిగతమున కొంచేమేనోయ్ మందగించక ముందుకడుగేయ్
_ గురజాడ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి