కులం' రద్దు కావాలంటే
'చిన్న' కులాలకు ఉత్పత్తి సాధనాలు వుండవు.
'పెద్ద' కులాలకే అవి వుంటాయి. అందులో కూడాతక్కువ సంఖ్యకే అవి వుంటాయి.చిన్న కులాల్లో మెజారిటీ సంఖ్య, కింది స్థాయిశారీరక శ్రమల్లోనే వుంటారు. పెద్ద కులాల్లో, 'శ్రమ'చేసే సంఖ్యలో మెజారిటీ సంఖ్య, పై స్థాయి శారీరక
శ్రమల్లోనూ, మేధోశ్రమల్లోనూ వుంటారు.కాబట్టి, ఇలాంటి సమాజంలో 'కులాల' సమస్య
ఎలా పరిష్కారం కావలసి వుంటుందంటే - 'ఉత్పత్తి
సాధనాల' మీద పెద్ద కులాలకు వుండే ప్రైవేటుహక్కు రద్దవడమూ, “పాత శ్రమ విభజన' మారడమూ - అనే మార్పుల ద్వారానే!
'ఉత్పత్తి సాధనాల' మీద ప్రైవేటు హక్కు రద్ద
వడం వల్ల, పెద్ద కులాలు చిన్న కులాల మీద యజ
మానులుగా వుండే స్తితి రద్దవుతుంది. శ్రమ చెయ్యని పెద్ద కులాల జనాభా కూడా శ్రమలోకి దిగుతుంది. తర్వాత, పాత శ్రమ విభజన రద్దవడం వల్ల, పెద్ద కులాలు శారీరక శ్రమల్లోకి కూడా రావడమూ, అలాగే చిన్న కులాలు మేడా శ్రమల్లోకి కూడా రావడమూ,జరుగుతాయి.ఈ మార్పుల్లో దీన్ని తీసుకున్నా అది వర్గ పోరాటమే.భూమి లేని చిన్న కులాలకు భూమి కావాలంటే - అది వర్గ పోరాటం ద్వారానే .
ఎప్పుడూ శారీరక శ్రమలే చేసేచిన్న కులాలు మేధో శ్రమల్లోకి రావాలంటే , అదికూడా వర్గ పోరాటం ద్వారానే.
కుల భేదాలకు పునాది, వర్గ భేదాలే. కాబట్టి, వర్గ పోరాటం మీదే కులాల అంతర్ధానం ఆధారపడి
వుంటుంది.
శారీరక శ్రమలు చేసే చిన్న కులాలే, మేధోశ్రమలు చేసే పెద్ద కులాల కన్నా విప్లవకరమైన శ్రామిక సెక్షన్లు. ఆ జనాభా వర్గ పోరాటాన్ని గ్రహించకపోతే, కులాల్ని తీసి వెయ్యగలిగే కార్యక్రమం ఏది సమాజంలో వుండదు. వర్గ పోరాటమే లేకపోతే, చిన్న కులాలు ఎప్పుడూ, ఉత్పత్తి సాధనాలు గల యజమానులకు సేవకులు గానూ, ఎప్పుడూ శారీరకశ్రమల్లోనూ, వుండిపోవలసిందే.
రంగనాయకమ్మ
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి