తుషారశీతల సరోవరాన
తెలుగు భాష పై చక్కని పాట.
https://youtu.be/kjoUxRsbCtU
తుషార
శీతల సరోవరాన
అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణ నీకొరకే రాజా వెన్నెలరాజా
కలనైన నీవలపే.. కలనైన నీవలపే
కలవరమందైన నీతలపే కలనైన నీ వలపే
కలువ మిటారపు కమ్మని కలలు
కలువ మిటారపు కమ్మని కలలు
కళలు కాంతులు నీ కొరకేలే
కళలు కాంతులు నీ కొరకేలే
చెలియారాధన సాధన నీవే
జిలిబిలి రాజ జాలి తలచరా
కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే కలనైన నీ వలపే
కనుల మనోరథ మాధురి దాచి అ..ఆ..అ.. ఆ..ఆ
కనుల మనోరథ మాధురి దాచి
కానుక చేసే వేళకు కాచి
కానుక చేసే వేళకు కాచి
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా
కలనైన నీవలపే కలవరమందైన నీతలపే
కలనైన నీవలపే
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి