పిళ్లా కలం.. రైతు గళం!
ఆయన వృత్తిరీత్యా జీవిత బీమా సంస్థలో
ఉద్యోగి. సాహిత్యంపై మక్కువతో రచయి
తగా మారారు.రాయలసీమ జిల్లాల్లో కరవు తో కునారిల్లుతున్న అన్నదాతల జీవితాలపై ముప్పై ఏళ్లుగా రచనలు చేస్తున్నారు.
కొత్త కవులను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో అనంతలో 'సాహితీ స్రవంతి' అనే వేదికను ప్రారంభించారు. ఇటీవల ఆవిష్కరించిన 'మట్టిపోగు'కు మేధావుల నుంచి
ప్రశంసలు అందుకున్నారు.
కుమారస్వామిది కడప లో జీవిత
భీమా సంస్థలో సహాయకుడిగా పనిచేస్తూ
పదోన్నతిపై అభివృద్ధి అధికారిగా కదిరికి వచ్చారు.తండ్రి లక్ష్మిరెడ్డి, అన్న దశరథరామిరెడ్డి, అక్కఇందిరాదేవి తెలుగు పండితులు. వీరి ప్రభావంతోసాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకున్నారు. గణితంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినా తెలుగంటే ప్రాణం. ఆ క్రమంలో ఎంఏ తెలుగు కూడా పూర్తి
చేశారు. డిగ్రీ చదివే రోజుల్లోనే రచనలకు శ్రీకారంచుట్టారు. ఉద్యోగం చేస్తూనే రచనలు కొనసాగిం రచించిన పుస్తకాలు
చారు. అనంతలో సాహితీ స్రవంతి అనే వేదికను ప్రారంభించి ఏటా గురజాడ, శ్రీశ్రీ,
జాషువా వర్ధంతులను నిర్వహిస్తున్నారు.
రైతు కష్టాలను కళ్లకు కట్టేలా.. :
'కరవు, ప్రపంచీకరణ వల్ల పల్లెలు నాశమయ్యాయి.ప్రజలు వలసబాట పట్టారు. కులవృత్తులు కనుమరుగయ్యాయి.' అని తన రచనల్లో ఆవేదన వెలిబుచ్చారు. 2007లో ప్రపంచీకరణపై పోటెత్తిన కవితా సంద్రం, 2015లో 'మే డే - కార్మికుల హక్కుల దీక్షాదినం, అనంత సాహితీ సమాలోచన, 2017లో రాయలసీమ ఆధునికసాహిత్య పరిణామక్రమం, అనంత కవితా స్వరాలను రచించారు. ఇటీవల 'రైతుల దీనస్థితులను వివరిస్తూ 'మట్టిపోగు' కవితా సంకలనంచేసి ఆవిష్కరించారు.
ఈ ఏడాది వేమన సాహిత్యంపై రాష్ట్రస్థాయిలో 250 సాహిత్య సంఘాలలో కార్యక్రమం నిర్వహించారు. ఆయనను గురజాడ ఫౌండేషన్ గురజాడ పురస్కారంతో సత్కరించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి