భారతీయ భాషలలో తెలుగు
భారతీయ భాషలలో తెలుగు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.1 కోట్ల (భారత దేశం 2011) 6.7% జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో 15వ స్థానంలో ఉంది.భారత దేశంలో హిందీ, తర్వాత 3వ స్థానంలో ఉంది. ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. వీరంతా తెలుగు ను మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలుగా సంస్కృతం, తమిళంతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వం గుర్తించింది.
తెలుగు మాట్లాడే దేశాలు:
భారతదేశం, బహ్రయిన్, కెనడా, ఫిజీ, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
తెలుగు మాట్లాడే రాష్ట్రాలు:
తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ (అధికార భాష), ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు(అధికార భాష)
తెలుగు మాట్లాడే వారికి తెలుగు తల్లి ఉంది. తెలుగు తల్లి ఒక చేత్తో పూర్ణ కుంభాన్ని, మరొక చేత్తో వరి కంకిని పట్టుకొని నిండైన విగ్రహం తో నిలబడి ఉంటుంది. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం.
ఇటలీ లోని వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డి కాంటే భారతదేశానికి వచ్చినప్పుడు రాయలసీమలో
పర్యటించారు.తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్' గా వర్ణించారు.అదే ఇప్పుడు తెలుగుకు ఒక బిరుదైంది.
కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలియుంటుంది.సకలభాషలకు మూలం సంస్కృతమని శ్రీ నాథుడు అన్నాడు గానీ అది వాస్తవం కాదు. సంస్కృత పదాలను నన్నయ డుమువులు కలిపి తెలుగు పదాలుగా మార్చాడు. అదే ఒరవడి తరువాత కవులు చేశారు. ఆ సంస్కృత పదాలు తెలుగులో ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల సంస్కృతం నుంచి తెలుగు వచ్చిందని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందింది.తమిళం, మళయాళం,కన్నడ, తెలుగు ద్రావిడ భాషలు. వీటికి మూలరూపం ఒకటి ఉండేది. వాటి నుంచి ఈ నాలుగు భాషలు వచ్చాయి. మన తెలుగు పదాలలోకి ఇతర భాషల పదాలు వచ్చి చేరాయి. అలా తెలుగు భాష సుసంపన్నమవుతోంది.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి