సాహితీ విమర్శకులకు ఒక కరదీపిక 'మమనార్ట్'
సాహిత్యమంతా (ప్రచారమేనని నమ్మిన ఆప్టన్‌సింక్లేర్ అమెరికాలో సోషలిస్టు సాహిత్యోద్యమాన్ని
20వ శతాబ్దంలో ప్రథమార్థంలో నిర్మించారు. ఆయన రచయితలు డబ్బుకు ఎలా దాసోహం
అవుతారో, అప్పుడువాళ్ళు తమ రచనల్లో ఎవరిని పౌగుడుతారో, ఎవరిని తెగనాడుతారో
సోదాహరణంగా వివరిస్తూ రచయితల వర్గ దృక్పథాన్ని వివరిస్తూ మమనార్ట్ ( 1421౦౧ గగ) ను
1927లో రచించాడు. ఆ (గ్రంధాన్ని ముక్తవరం పార్థసారధి తన స్వేచ్చానువాదంతో పాటు తన
వ్యాఖ్యానాన్ని కూడా రాసి మన అవగాహనను పెంచినారు. దీనిని 'కాసుల కబంద హస్తాలలో
కళల సాహిత్యం' పేరుతో జన సాహితి ప్రచురించి కొత్తతరం సాహిత్యకారులకు ఒక పాఠ్యగ్రంథంలాగా
అందరికీ అందుబాటులోకి తెచ్చింది. (ప్రతి ఒక్కరూ చదవాల్సిన (గ్రంథమిది.
క్రీ.పూ. 800నుండి క్రీ.శ. 1924వరకు వున్న మధ్యకాలంలో వచ్చిన వివిధ రచనలపై
ఆయారచయితల రచనలను విశ్లేషిస్తూ వారి జీవిత విశేషాలను కూడా ఒకవైపు వివరిస్తూ వారి
సాహిత్యంలోనూ, జీవితంలోనూ ఉన్న వైరుద్యాలను విపులంగా వివరించాడు. అదే సందర్భంలో
వారి సాహిత్యం ఎవరివైపు నిలబడిందో స్పష్టం చేస్తూ తన సొంత వ్యాఖ్యనాలను చెప్తూ వివరిస్తాడు
'మమనార్ట్. సాహిత్యరంగంలో వర్గపోరాటాన్ని సాగించే సాహిత్యోద్యమ కారులందరికీ ఒక కరదీపికగా
“మమనార్ట్' ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినాడు. సాహిత్యం సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడే
ఒకసాధనం. ఇది సమాజంలోని సంఘటనలతో (ప్రభావితమవుతూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ
ఉంటుంది. దీన్ని గుర్తించిన సాహిత్య కారులు సమాజ చైతన్యం కోసం రచనలు చేయాల్సి ఉ
౦టుంది.
సాహిత్యకారుడు కష్టజీవులకు కుడి ఎడమల నిలబడతారని (శ్రీశ్రీ చెప్పినాడు. అయితే పీడితులు
విజయం సాధిస్తూ నింగికెగిరినప్పుడు నిబిడాశ్చర్యంగా చూస్తూ వారివైపు నిలబడిన రచయితలను
గొప్పగా కీర్తిస్తారని, అదే పీడితులు పరాజితులై నిప్పులు చిమ్ముకుంటూ నేలకు రాలిపోతే వారిని
నిర్ధాక్షిణ్యంగా కాలరాస్తారని, వారిని కీర్తించిన రచయితలను మక్‌రేకర్స్‌లని, ప్రాపగాండిస్టులని,
సోమరిపోతులని హేళన చేస్తారని సింక్షేర్ చెపుతారు.
రచయితకు సామాజిక దృక్పథం ఉండటం లేదంటే ఆరచయిత సమాజాన్ని పరిశీలించకుండా
తన ఊహాలోకంలో ఉండి ఉండాలి. సమాజంలో దోపిడీ ఉంది. సమాజంలో అవినీతి ఉంది.
సామాన్య ప్రజలు పెట్టుబడీదారీ విషవలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ఎంతో సంక్లిష్టంగా
ఉన్న సమాజాన్ని విశ్లేషించడానికి సమస్య మూలాన్ని పట్టుకోవడానికి మార్కిస్టు దృక్పథం బాగా ఉ
పయోగపడుతుంది. ఇలాంటి దృక్పథాన్ని అర్ధం చేసుకోకుండా రచనలు చేసే నేటి సమాజపు
రచయితలను ఏమవాలో అర్ధం కావడంలేదని ఆప్టన్ సింక్లేర్ చెపుతాడు.
రచయితలు ద్వంద్వ స్వభావం గలవారై ఉంటే దాన్ని ప్రజలు అసహ్యించుకుంటారు. తాను
చెపుతున్నదానికి, ఆచరణకు పొంతన లేనపుడు ప్రజలు రచయితలంతా ఇంతేనా అని రచయితలపట్ల
చులకన భావం పెంచుకుంటారు. దీన్నే నిబద్ధత లేకపోవడం అంటారు. ఆరోజుల్లో కూడా
రచయితల్లో నిబద్దత లేకపోవడాన్ని సింక్షేర్ తప్పుపట్టాడు. చెప్పేందుకే మేమున్నాం. మేం మాత్రం
ఆచరించం. మీరు ఆచరిస్తారో లేదో మీ ఇష్టం అన్నట్లన్నమాట. ఆయన మార్క్‌ట్వేన్ గురించి
చెపుతూ పెట్టుబడీదారీ సమాజంలో ఉన్న కుహనా సంస్కృతిని ఒకవైపు విమర్శిస్తూనే మరోవైపు
అదేసమాజపు అందించే సుఖలాలసతకు ఉదాహరణగా మార్క్‌ట్వేన్ లొంగిపోవటాన్ని (ప్రస్తావించాడు.
ఇలాంటి నిబద్ధతలేని రచయితల చిత్తశుద్ధిని ఆయన తప్పుపట్టాడు. రచయితలు ఇలాంటి
ద్వంద్వ ప్రమాణాలతో ఉండరాదని ఆయన కోరుకున్నాడు.
నేడుమన సమాజంలో కూడా ఇలాంటి రచయితలను చాలామందిని చూస్తుంటాం. ఒకవైపు
పాలకులనూ విమర్శిస్తూ వాళ్ళిచ్చే అవార్డులకు, బహుమతులకు ఆకర్షణకు లొంగిపోతుంటారు.
డబ్బుకు అమ్ముడుబోయిన వాడు నిజాయితీగా ఉండలేడు. నిజాయితీగా బతకలేనివాడు
సంతోషంగా ఉండడనే సత్యాన్ని మనకు ఎరుక పరుస్తాడు. వ్యక్తి సమస్యలన్ని సామాజిక సమస్యలేనని
టాల్‌స్టాయ్ చెప్పిన విషయాన్ని చెపుతూ నిజాయితీగా బతికి నిజాయితీగా రాసి నిబద్ధత కలిగినవాడు
మంచి రచయితగా ప్రకటిస్తాడు సింక్షేర్. ఇలాంటి కోవలోకి వచ్చే (ప్రేమ్‌చంద్, (శ్రీశ్రీ, చెరబండరాజు,
అలిశెట్టి ప్రభాకర్ వంటి కవులు రచయితలు మరెందరో మనదేశంలో ఉన్నారు.
ధనస్వామ్యానికి, ధనార్జనకు నిలయం అమెరికా. ఆదేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో
ఎత్తుకు ఎదిగింది. ఇలాంటి సమాజంలో కళాకారుడు ఒక విదూషకునిగా మారిపోయి కాసుల
కబంధహస్తాలలో నలిగిపోతాడన్నారు సింక్షేర్, అంతేగాక కొన్ని వృత్తులకు ఇండియాలో మాదిరి
అమెరికాలో కూడా గౌరవమైన స్థానం ఇవ్వటంలేదు. అ వృత్తుల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత
ప్రతిభావంతులైనా అమెరికన్ సమాజం తక్కువగా చూస్తుంది. ఈ సమస్య మనదేశంలో దళితులకు
ఎక్కువగా ఎదురవుతుంటుంది. ఇవన్నీ భూస్వామ్య అవశేషాలు. ఆనాటి భావజాలం పెట్టుబడీదారీ
వ్యవస్థ పరిపక్వమవుతున్నా ఇంకా పోలేదన్నమాట. మనదేశంలోనైతే భూస్వామిక భావజాలం
అడుగడుగునా పాలక వర్గంలోను సమాజంలోనూ నిత్యం చూస్తూనే ఉన్నాం.
సమాజంలో అసమానతలపై, దుర్లక్షణాలపై ఎక్కుపెట్టిన రచనలు పెరగాలి. అయితే వాటిని
ప్రజలకు చేర్చాలంటే చైతన్యపూరిత సంఘాలు ప్రత్యేక (శ్రద్ధతో సాహిత్యోద్యమాన్ని నిర్మించాలి.
అప్పుడేసామాజిక వికాసం సాధ్యమవుతుంది.
కవి ప్రజల పక్షం వహించాలని పి.బి. షెల్లీ చెపితే, ప్రపంచబాధను తన బాధగా చూడగలిగిన
వాడే కవి అని, కీట్స్ ఏనాడో చెప్పినాడు. కొంతమంది కవులు అలా చూడగలిగారని మరికొంతమంది
తమ బాధను మాత్రమే వెల్లడించారని సింక్లేర్ గుర్తించాడు. (ఫెంచి విప్లవం సందర్భంలో విప్లవాన్ని
చూసి వర్డ్స్‌వర్త్ బెదిరిపోతే భైరన్ పోరాటవాదుల వైపు నిలిచాడని పేర్కొన్నారు. విక్టర్ హ్యూగో తన రచనల ద్వారా (ఫ్రెంచి సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలికినాడు. ఇవన్నీ వివరిస్తూ
మానవీయ విలువలకోసం తమజీవితాన్ని అర్చించిన మహానీయులైన రచయితలే చరిత్రలో నిలుస్తారని
ఆయన చెపుతారు.
“నువ్వు బలప్రయోగం చేయకు. నీనైతిక బలంతో అతడి మనస్సును మార్చు. తన
హింసకు తానే సిగ్గుపడేలా చెయ్యి” ఇది టాల్‌స్టాయ్ తన రచనల ద్వారా సందేశం ఇచ్చినట్లుగా
చెపుతాడు సింక్షేర్. కళకు నైతికతను జోడించిన గొప్పరచయితగా ఆయన్ను కీర్తించాడు. అతనిలాగే
ఎస్కీలన్, సోఫాక్టీన్, వర్డిల్, డాంటే, సెర్వాంటిస్, విక్టర్‌హ్యూగో, దోస్తాయెవిస్కీ, ఇబ్సన్ మొదలైనవారి
రచనలు నైతికతకు ప్రాధాన్యత నిచ్చాయి. మనదేశంలో ఠాగూర్, (ప్రేమ్‌చంద్ సాహిత్యంలో నైతికతను
నొక్కిచెప్పినారు.
“పాత్రల జీవనసరళి గురించి వ్యాఖ్యానించకుండా కష్టాల్లో ఉన్నవాళ్ళు ఏంచేసి బయటపడాలో
చెప్పకుండా యథాతథ చిత్రణకే ప్రాధాన్యత నిచ్చే రచయితలు పలాయన వాదులు” అని ఆప్టన్
సింక్లేర్ అభిప్రాయపడినాడు. ఈ అంశం మీద చాలా మంది రచయితలు రకరకాలుగా
వ్యాఖ్యానించారు మన తెలుగు సాహిత్యంలో. రచయిత పాఠకునికి పరిష్కారం చూపాలని, కొంతమంది
ఆదేమీ చెప్పకుండా పాఠకుని నిర్ణయానికే వదిలేయాలని వాదన చేసినారు. కాకపోతే రచయిత
ఒక పరిష్కారం సూచించినప్పుడు అది పాఠకునికి నచ్చకపోతే ఇంకో పరిష్కారాన్ని తనే వెదుక్కుంటాడు.
అసలు చెప్పకపోతే పాఠకుడు పరిష్కారం దిశగా ఆలోచించే మార్గం అతనికి కలుగకపోయే అవకాశం
ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సింక్షేర్ చెప్పినట్లు రచయిత పలాయనవాది కారాదు.
అమెరికా, యూరప్ రచయితల రచనలను పరిశీలించి విశ్లేషించి వారి రచనలు ఎవరికోసం
ఉపయోగపడతామో మనకు ఎరుకపరుస్తాడు సింక్లేర్ ఈ గ్రంథంలో. పైగా అనువాదకుడు ముక్తవరం
పార్థసారధి రచయితల గురించి ఇచ్చిన అదనపు సమాచారం మన అవగాహనను విస్తృత పరుస్తుంది.
ఈ విశ్లేణాత్మ విధానం మనదేశంలోని రచయితల రచనలు ఏ వర్గానికి సహాయపడుతున్నాయో
మనం అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. జాషువారచనలు అట్టడుగువర్గాలైన దళిత జీవుల
గురించి మాట్లాడితే విశ్వనాథ సాహిత్యం వర్ణవ్యవస్థను కీర్తించటానికి, సమాజం మారకుండా
ఉండటానికి దోహదం చేస్తాయని నిస్సంకోచంగా చెప్పగలం. ఇలా సాహిత్యవిమర్శా రంగంలో
కృషిచేయాలనుకునేవారికి ఒక కరదీపికగా, ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు.
పిళ్లా కుమారస్వామి-9490122229
(May2019 సాహిత్య ప్రస్థానం పత్రికలో వచ్చిన సమీక్షావ్యాసం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి