మైనారిటీవాద సాహిత్యం

మైనారిటీవాద సాహిత్యం


           సోవియట్ పతనం తరువాత ప్రారంభమైన ప్రపంచీకరణ దళిత, స్త్రీవాదులను ఎలా దెబ్బ తీసిందో అలాగే సమాజాన్ని ఆధునికాంతరవాద ధోరణులు విచ్ఛిన్నం చేశాయి. ప్రైవేటీకరణ,
సరళీకరణ విధానాలు ప్రజల ఆర్ధిక స్థితిగతుల్లో పెనుసంక్షోభం సృష్టించాయి. ఉపాధి అవకాశాలను దెబ్బతీశాయి. ప్రజల్లో  ఏర్పడుతున్న అసంతృప్తిని తమవైపు మళ్లించేందుకు మతోన్మాదశక్తులు
మతమౌఢ్యాన్ని పెంచాయి. ఒక కవి అన్నట్లు

 కుల,మతాలు మలమూత్రాలాంటివి
మొదటిది విసర్జిస్తే దేశానికి మంచిది
రెండవది విసర్జిస్తే దేహానికి మంచిది.

       మత సామరస్యాన్ని పెంచాల్సిన పాలకులు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. 2003లో గుజరాత్ లో ముస్లింలపై మారణకాండ జరుగుతున్నా ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడి
మౌనం వహించారు. ఆ గాయాల గేయాలను 'గుజరాత్ గాయం'గా ప్రచురించారు. "నేను పుట్టక ముందే దేశ ద్రోహులు జాబితాలో నాపేరు నమోదై ఉంది" అంటూ వచ్చిన 'పుట్టుమచ్చ' కవిత మైనార్టీ వాదాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టింది. దీన్ని ఖాదర్ మొహియుద్దీన్ రాశాడు. ఆ వెలుగులో మైనారిటీ సాహిత్యం, జలజలా, అజా, ముఖేటా వచ్చాయి. అఫ్సర్, స్కైబాబా, యాకూబ్, కరీముల్లా, ఖాదర్ మొహిద్దీన్, షాజహానా, దిలావర్ మొదలైనవారు మైనారిటీ వాదాన్ని వినిపిస్తున్నారు. 'పహెచాన్' కథా సంపుటి వచ్చింది. ముస్లిం స్త్రీల నరకయాతనను వీరు ఇందులో ఆవిష్కరించారు.
            మైనారిటీ వాదంలో కూడా ఇస్లాం వాదం, ముస్లింవాదం అంటూ రెండు చీలికలు వచ్చాయి. ప్రపంచీకరణ వెల్లువలో వచ్చిన అస్థిత్వ వాదాల ప్రభావం ఈ వాదం పైనా పడింది.
     CAA ఏర్పాటు చేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది.ఇది సమైక్య, లౌకిక ప్రజాస్వామిక సమాజాన్ని చీల్చడానికేనని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు విమర్శిస్తూ 2019లో ఆందోళనలు, పోరాటాలు చేశారు. 2020లో కరోనా వ్యాధి విజృంభణ తో అది పక్కన పడిపోయింది. ఇప్పుడు ఉమ్మడి సివిల్ కోడ్ ను ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించింది.  భిన్నత్వంలో ఏకత్వం అనే సామాజిక సంఘటన పై విచ్చుకత్తి ఇంకా వేలాడుతూనే ఉంది.
      మైనారిటీలో అభద్రత పెరిగింది. తమ అస్థిత్వ వాదం ఇతరుతో కలిసి పోరాడినప్పుడే తమ అభద్రతా భావం పోతుందన్న స్పృహ ముస్లిం మైనారిటీ  వాదుల్లో పెరిగింది. కలిసి పాడాల్సిన గీతాన్ని, కలిసి పోరాడాల్సిన అవసరాన్ని శత్రువు తన విచ్చిన్న విధానాలతో కలిగిస్తున్నాడు. ఈ విచ్చుకత్తిని సమైక్య శంఖారావం తప్పకుండా చేధిస్తుంది.

___ kumaraswaamy,9490122229

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగు కథానిక - వికాసం

కార్తెలు ( kārte)

స్వేచ్ఛా శృంగార కథల సమాహారం శుకసప్తతి కథలు