దేశభక్తి గీతం
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
పొట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్ !
దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవ వలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్
పాడిపంటలు పొంగి పొరలే
దారిలో నువు పాటుపడవోయ్
తిండి కలిగితె కండగలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్
జల్లుకొని కకెలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నింపవోయ్
సొంత లాభం కొంత మానుకో
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
- గురజాడ అప్పారావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి