రావిశాస్త్రి
రావిశాస్త్రి పూర్తి పేరు రాచకొండ విశ్వనాథ శాస్త్రి.రచయిత తాను రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను.మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తానని అనేవాడు రావిశాస్త్రి.
లాయరు గా పని చేస్తూ పేద ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడాడు. విరసం వ్యవస్థాపకు ల్లో ప్రముఖుడిగా నిలిచారు. అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలయ్యారు. ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముళ్ళ కోసం, చల్లారిన సంసారాల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించారు రావిశాస్త్రి.
1993, నవంబర్ 10 న రావిశాస్త్రి కన్నుమూశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి